Jawan 25 Days Collections: భారత సినీ చరిత్రలో సంచలనం.. అన్ని కోట్లు రాబట్టిన తొలి సినిమాగా రికార్డు
విలక్షణమైన నటన, విభిన్నమైన సినిమాలతో ఇండియన్ సినిమాలో తనదైన ముద్రను వేస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. దాదాపు నలభై ఏళ్లుగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. 'పఠాన్' చిత్రంతో మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ జోష్‌లోనే ఇటీవలే షారూక్ 'జవాన్' అనే సినిమాను చేశాడు. యాక్షన్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు నాలుగో వారంలోనూ వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇలా ఈ చిత్రం కొత్త చరిత్రను సృష్టించింది. ఈ నేపథ్యంలో 'జవాన్' మూవీ 25 రోజుల రిపోర్టును మీరే చూడండి మరి!
షారూక్ ఖాన్ 'జవాన్'గా మారి:బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'జవాన్'. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ రూపొందించిన ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీనికి అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చాడు. దీపిక పదుకొనే కీలక పాత్ర చేసింది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు.

జవాన్ మూవీ బిజినెస్.. రిలీజ్:ఫుల్ లెంగ్త్ యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫలితంగా ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 10000లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.
ఏ రోజు ఎంత వచ్చిందంటే?:అట్లీ - షారూక్ కాంబోలో వచ్చిన 'జవాన్' మూవీకి రెస్పాన్స్ భారీగా దక్కుతోంది. ఇలా ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో రూ. 389.88 కోట్లు, 2వ వారంలో రూ. 128 కోట్లు, 3వ వారంలో రూ. 55.92 కోట్లు రాబట్టింది. ఇలా 3 వారాల్లో రూ. 573.80 కోట్లు నెట్‌ను కలెక్ట్ చేసింది. ఇక, 22వ రోజు రూ. 5.97 కోట్లు, 23వ రోజు రూ. 5.05 కోట్లు, 24వ రోజు రూ. 8.50 కోట్లు నెట్‌ను వసూలు చేసింది.

25వ రోజు ఎంత వచ్చిందంటే:ఎంతో మంది పేరున్న నటీనటులు కీలక పాత్రల్లో నటించిన 'జవాన్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ భారీ వసూళ్లు లభిస్తున్నాయి. వీక్ డేస్‌లో ఇది డౌన్ అయినా.. వీకెండ్స్‌లో మాత్రం దుమ్ము దులుపుతోంది. ఇలా నాలుగో వీకెండ్‌లోనూ బాగా రాణించింది. ఇలా 25వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 8.80 కోట్లు నెట్, రూ. 17 వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు:బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో అతడు నటించిన 'జవాన్' చిత్రాన్ని విదేశాల్లోనూ అత్యధిక స్క్రీన్లలో విడుదల చేశారు. ఇక, ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇలా 25 రోజులకు కలిపి ఇది 44 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 366.11 కోట్లు రాబట్టి సత్తా చాటుకుంది.

25 రోజులకూ కలిపి ఎంతంటే:బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా అట్టీ తెరకెక్కించిన 'జవాన్' మూవీకి 25 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 604.25 కోట్లు నెట్‌తో పాటు రూ. 1085 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా రూ. 600 కోట్లు నెట్ కలెక్షన్ల మార్కును దాటిన ఏకైక హిందీ చిత్రంగా ఇది చరిత్రను సృష్టించింది. అలాగే, బాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక గ్రాస్ సాధించిన మూవీగానూ నిలిచింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది 25 రోజుల్లోనే రూ. 604 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమా ఇప్పటి వరకూ రూ. 604 కోట్లు లాభాలను కూడా అందుకుంది.


Click it and Unblock the Notifications











