Jawan 26 Days Collections: పఠాన్ రికార్డులను బద్దలు కొట్టిన జవాన్... నెక్ట్స్ టార్గెట్ ప్రభాస్ సినిమానే!
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం జవాన్. ఇక ఈ సినిమాను అట్లీ తెరకెక్కించగా... నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక విజయ్ సేతపతి విన్ గా నటించగా.. దీపికా పదుకునే, ప్రియమణి, వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీనికి అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇక ఈ మూవీ 26 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం.
అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్... బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయి 26 రోజులు కావొస్తున్నా... వసూళ్లు మాత్రం ఆగడం లేదు. జవాన్' మూవీపై మొదటి అంచనాలు భారీగా ఉండగా... ఈ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 10000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.

తమళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్ మూవీకి 26 రోజులు దాటినా కలెక్షన్లు వస్తునే ఉన్నాయి. ఇక ఈ చిత్రం మొదటి వారంలో రూ. 389 కోట్లు వసూలు చేయగా... 2వ వారంలో రూ. 128 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఇక 3వ వారంలో రూ. 55.92 కోట్లు రాబట్టింది. ఇలా 3 వారాల్లో రూ. 573 కోట్ల నెట్ ను వసూలు చేసింది. ఇక, 22వ రోజు రూ. 6 కోట్లు, 23వ రోజు రూ. 5 కోట్లు, 24వ రోజు రూ. 8 కోట్లు,25వ రోజు 9కోట్ల నెట్ ను వసూలు చేసింది.

26వ రోజు ఎంత వచ్చిందంటే?:జవాన్ సినిమా రిలీజ్ అయి 26 రోజులు అయింది. అయినా కలెక్షన్లు మాత్రం ఏమాత్రం తగ్గకుండా వస్తున్నాయి. వీక్ డేస్ కాస్త స్లో అయినా.. వీకెండ్ మాత్రం దుమ్ముదులుపుతున్నాయి. ఇక 26రోజు వర్కింగ్ డే రోజూ... ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 6.80 కోట్లు నెట్, రూ. 13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో బాగా వసూళ్లు రాబడుతోంది. 'జవాన్' చిత్రాన్ని విదేశాల్లో ఇప్పటికే అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక, ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు రాబడుతోంది. ఇలా 26 రోజులకు కలిపి రూ. 365 కోట్లు రాబట్టింది.

26 రోజులకూ కలిపి ఎంతంటే:బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన 'జవాన్' మూవీకి 26 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 611.58 కోట్లు నెట్‌తో పాటు రూ. 1084కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇండియాలోరూ. 718.75 గ్రాస్ వసూలు చేయగా.. ఓవర్సీస్ లోరూ.365.25 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా పఠాన్ రికార్డులను బద్దలు కొట్టింది. పఠాన్ 1047 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. ఇప్పుడు జవాన్ 1084 కోట్లతో ముందంజలో ఉంది. ఇక ప్రభాస్ బహుబలి సినిమా వసూళ్లను బ్రేక్ చేసేందుకు సిద్ధం అవుతుంది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీని రూ. 300 కోట్లతో నిర్మించగా... అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ నమోదు చేసుకుంది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఇది ప్రేక్షకుల ముందుకు రాగా... ఇది 26 రోజుల్లోనే రూ. 1084కోట్లు రాబట్టింది. అంటే ఈ సినిమా ఇప్పటి వరకూ రూ. 700 కోట్లకు పైగా లాభాలను కూడా అందుకుంది.


Click it and Unblock the Notifications











