Jawan 3 Weeks Collections: 300 కోట్ల సినిమా.. 3 వారాల్లో 1000 కోట్లు దాటేసి.. బాహుబలి 2 రికార్డు ఖతం

ఇండియాలో ఉన్న సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ మంది మాత్రమే ప్రపంచ దేశాల్లో సైతం ప్రభావాన్ని చూపించే స్థాయికి ఎదిగారు. అందులో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఒకడు. ఇలా దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న ఆయన.. ఇటీవలే 'జవాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో వసూళ్లు పోటెత్తాయి. ఇలా మూడు వారాలుగా ఈ సినిమా బాక్సాఫీస్‌పై ఓ రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో 'జవాన్' మూవీ 21 రోజుల కలెక్షన్ల రిపోర్టును చూద్దామా!

'జవాన్‌'గా వచ్చేసిన షారూక్:బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు. దీపిక పదుకొనే కీలక పాత్ర చేసింది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు.

Jawan Movie 3 Weeks Worldwide Box Office Collections.. Crosses Bahubali 2 Record

జవాన్ మూవీ బిజినెస్.. రిలీజ్:విభిన్నమై కాంబోలో వచ్చిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫలితంగా ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే షారూక్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 10000లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు

Jawan Movie 3 Weeks Worldwide Box Office Collections.. Crosses Bahubali 2 Record

ఏ రోజు ఎంత వచ్చిందంటే?:అట్లీ - షారూక్ కలిసి చేసిన 'జవాన్' మూవీకి ఆరంభం నుంచే రెస్పాన్స్ కూడా దక్కుతోంది. ఇలా ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో రూ. 389.88 కోట్లు, 2వ వారంలో రూ. 128 కోట్లు నెట్‌ను కలెక్ట్ చేసింది. 15వ రోజు రూ. 8.10 కోట్లు, 16వ రోజు రూ. 7.61 కోట్లు, 17వ రోజు రూ. 12.25 కోట్లు, 18వ రోజు రూ. 14.95 కోట్లు, 19వ రోజు రూ. 5.40 కోట్లు, 20వ రోజు రూ. 4.9 కోట్లు నెట్‌ వసూలు చేసింది.

Jawan Movie 3 Weeks Worldwide Box Office Collections.. Crosses Bahubali 2 Record

21వ రోజు ఎంత వచ్చిందంటే:షారూక్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు చేసిన 'జవాన్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ భారీ వసూళ్లు లభిస్తున్నాయి. మూడో వీకెండ్‌లో మాత్రం ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. కానీ, వీక్‌ డేస్‌లో మళ్లీ డౌన్ అవుతూనే వచ్చింది. ఇలా 21వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 4.85 కోట్లు నెట్, రూ. 8 వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.

Jawan Movie 3 Weeks Worldwide Box Office Collections.. Crosses Bahubali 2 Record

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు:షారూఖ్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రాన్ని విదేశాల్లో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇక, 21 రోజులకు కలిపి ఇది 40.7 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 338 కోట్లు రాబట్టింది. ఇక, నార్త్ అమెరికాలో ఇది 13.1 మిలియన్ డాలర్లు రాబట్టింది. దీంతో RRR పేరిట ఉన్న 14.3 రికార్డుకు చేరువైంది.

Jawan Movie 3 Weeks Worldwide Box Office Collections.. Crosses Bahubali 2 Record

21 రోజులకూ కలిపి ఎంతంటే:యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'జవాన్' మూవీకి 21 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 575.93 కోట్లు నెట్‌తో పాటు రూ. 1030 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రం రూ. 5.15 కోట్లు వరకూ నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో 'బాహుబలి 2' పేరిట ఉన్న రూ. 510.90 కోట్లు నెట్ రికార్డును దాటేసి సత్తా చాటుకుంది.

Jawan Movie 3 Weeks Worldwide Box Office Collections.. Crosses Bahubali 2 Record

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది 21 రోజుల్లోనే రూ. 575.93 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమాకు ఇప్పటి వరకూ రూ. 275.93 కోట్లు లాభాలను కూడా వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X