Jawan 9 Days Collections: షారూక్ మరో సంచలనం.. అటు 700 ఇటు 400 కోట్లు ఔట్.. దేశంలోనే తొలి సినిమాగా!
ఇండియన్ సినిమాపై దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగానే ప్రభావాన్ని చూపిస్తూ పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా సత్తా చాటుతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలను అందుకున్న ఆయన.. ఈ మధ్య కాలంలో చాలా ఫ్లాపులతో సతమతం అయ్యాడు.
ఈ పరిస్థితుల్లోనే 'పఠాన్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఊపులోనే ఇటీవలే 'జవాన్' చిత్రంతో వచ్చి మళ్లీ సత్తా చాటాడు. ఈ మూవీ వసూళ్ల వర్షం కురిస్తూ సెన్సేషన్ అవుతోంది. ఈ నేపథ్యంలో 'జవాన్' మూవీ 9 రోజుల బాక్సాఫీస్ రిపోర్టను మీరే చూడండి!

జవాన్‌గా ఎంటరైన స్టార్ హీరో: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన సినిమానే 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు.ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే స్పెషల్ రోల్‌లో కనిపించింది.

జవాన్ మూవీ బిజినెస్.. రిలీజ్: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫలితంగా ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే షారూక్ మూవీని వరల్డ్ వైడ్‌గా 10000లకు పైగా థియేటర్లలో తీసుకు వచ్చారు.

ఏ రోజు ఎంత వచ్చిందంటే?: తమిళ డైరెక్టర్ అట్లీ - బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ కాంబోలో వచ్చిన 'జవాన్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ప్రేక్షకులు మంచి స్పందన కూడా దక్కుతోంది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. ఇలా ఈ చిత్రం వారంలో రూ. 368.38 కోట్లు నెట్ రాబట్టింది. అయితే, రెండో వారంలో కాస్త స్లో అవడంతో ఎనిమిదో రోజు రూ. 21.6 కోట్లు నెట్ వసూలు అయింది.

9వ రోజు ఎంత వచ్చిందంటే: షారూక్ ఖాన్, నయనతార జంటగా నటించిన 'జవాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. అయితే, 9 రోజు ఈ చిత్రం బాగానే హోల్డ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా 9వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 21.00 కోట్లు నెట్, రూ. 40 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు: సీనియర్ స్టార్ హీరో షారూక్ ఖాన్‌కు వరల్డ్ వైడ్‌గా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే 'జవాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇక, 9 రోజులకు కలిపితే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 28.9 మిలియన్ డాలర్లు అంటే రూ. 240.13 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది.

9 రోజులకూ కలిపి ఎంతంటే: యాక్షన్ జోనర్‌లో రూపొందిన 'జవాన్' మూవీకి ఓవరాల్‌గా మంచి రెస్పాన్సే లభిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 9 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 410.88 కోట్లు నెట్‌తో పాటు రూ. 730 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా వేగంగా రూ. 400 కోట్లు నెట్, 700 కోట్లు గ్రాస్ వసూళ్లను అందుకున్న హిందీ చిత్రంగా ఇది రికార్డును నమోదు చేసుకుంది.
టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: షారూక్ నటించిన'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొమ్మిది రోజుల్లో రూ. 410.88 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమాకు ఇప్పటి వరకూ రూ. 110.88 కోట్లు లాభాలను కూడా సాధించింది.


Click it and Unblock the Notifications











