Jawan Closing Collectons 1130 కోట్లు కొల్లగొట్టిన జవాన్.. ఎన్ని వందల కోట్ల లాభమో తెలుసా?
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ట్రేడ్ అంచనాలను మించి వసూళ్లను నమోదు చేసింది. నయనతార, దీపిక పదుకోన్, విజయ్ సేతుపతి లాంటి అగ్రతారలు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ఎంత బిజినెస్ జరిగింది? ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
జవాన్ చిత్రానికి సంబంధించిన బడ్జెట్, బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాను సుమారుగా 300 కోట్ల రూపాయాలతో నిర్మించారు. ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులను బాలీవుడ్‌కు చెందిన పెన్ మరుధార్ ఎంటర్‌టైన్‌మెంట్ సుమారుగా 110 కోట్ల రూపాయలు చెల్లించి థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకొన్నది. తెలుగులో ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్, తెలుగులో దిల్ రాజ్‌కు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, కేరళలో శ్రీ గోకులం మూవీస్, బెంగాళీలో ఎస్‌వీఎఫ్, యష్ రాజ్ ఫిలింస్ కమిషన్ ప్రాతిపాదికన రిలీజ్ చేశాయి.

ఇక జవాన్ సినిమా నాన్ థియేట్రికల్ రిలీజ్ విషయానికి వస్తే.. ఈ మూవీ ఓటీటీ హక్కులను 480 కోట్ల రూపాయలకు, శాటిలైట్ హక్కులను 240 కోట్ల రూపాయలకు అమ్మడం జరిగింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే సుమారుగా 300 కోట్ల రూపాయలకుపైగా లాభాన్ని ఆర్జించింది. ఇటీవల కాలంలో ఈ రేంజ్ లాభాలను నమోదు చేసిన చిత్రంగా ఈ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
జవాన్ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడం, ప్రమోషనల్ కార్యక్రమాలకు ప్రేక్షకులు కనెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచానలు పెరిగాయి. అంచనాలకు తగినట్టే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేశారు. ఇండియాలో 6000 స్క్రీన్లకుపైగా, ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్లకుపైగా మొత్తంగా 11000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.

జవాన్ సినిమాకు సూపర్ టాక్ రావడంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లు నమోదు చేసింది. ఈ సినిమా తొలి రోజు 130 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం 650 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 19వ రోజు ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ల మైలురాయిని అధిగమించింది.
జవాన్ సినిమాకు సంబంధించిన ఫుట్‌ఫాల్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా ఇండియాలో 31 రోజుల్లో 3.4 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది ఇండియాలో ఓ రికార్డుగా చెప్పుకోవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ ఫుట్ ఫాల్స్ సొంతం చేసుకొన్న చిత్రమని అన్నారు.

జవాన్ సినిమా గత 36 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అన్ని భాషల్లో ఈ మూవీ 630 కోట్ల షేర్ సాధించింది. హిందీలో 560 కోట్ల షేర్ నమోదు చేసింది. తెలుగు, తమిళంలో 60 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 385 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 1125 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కొన్ని చోట్ల ఈ సినిమా ఆడుతున్నందున్న ఈ చిత్రం 1130 నుంచి 1135 కోట్ల మధ్య కలెక్షన్లతో థియేట్రికల్ రన్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.

జవాన్ మూవీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 300 కోట్ల రూపాయలుగా వ్యాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా 320 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్ర మొదలు పెట్టింది. ఈ సినిమా దాదాపు 1130 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 800 కోట్లకుపైగా లాభాలను రాబట్టింది. షారుక్ ఖాన్‌తో కెరీర్‌లో భారీ హిట్‌గా జవాన్ చరిత్ర సృష్టించింది.


Click it and Unblock the Notifications











