Jawan Collections కేజీఎఫ్ 2, పఠాన్, గదర్ 2 రికార్డులు బ్రేక్.. జవాన్ కలెక్షన్లు ఎంతంటే?
బాలీవుడ్ బాద్షా, ఇండియన్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, నయనతార, దీపిక పదుకోన్, విజయ్ సేతుపతి నటించిన జవాన్ చిత్రం అట్టహాసంగా థియేటర్‌లోకి వచ్చింది. మాస్, మసాలా, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డు కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
జవాన్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌కు అభిమానులు, సినీ ప్రేక్షకులు పోటెత్తారు. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ట్రేడ్ అంచనాల ఊహకు మించి అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. తొలి రోజు కోసం 15 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. కేజీఎఫ్2, పఠాన్, గద్దర్ రికార్డులు బ్రేక్ చేసింది.

జవాన్ చిత్రం అడ్వాన్సు బుకింగ్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం రికార్డు వసూళ్లను సాధించింది. తొలి రోజు కోసం అడ్వాన్స్ బుకింగ్ 30 కోట్ల నికర వసూళ్లు, 36 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక తొలి వారాంతం కోసం 50 కోట్ల రూపాయల నికర వసూళ్లు, 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు నమోదు అయ్యాయి.

జవాన్ చిత్రం తొలి రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హిందీ వెర్షన్‌కు మార్నింగ్ షో 55 శాతం, మ్యాట్నీకి 60 శాతం ఫస్ట్ షోకు 65 శాతం, సెకండ్ షోకు 65 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తమిళంలో ఓవరాల్‌గా 55 శాతం, తెలుగులో రికార్డు ఆక్యుపెన్సీ నమోదు అవుతూ.. మార్నింగ్ షకోు 65 శాతం, మ్యాట్నీకి 80 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. చెన్నై, లక్నో, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, ఢీల్లీలో 65 శాతం నుంచి 85 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

జవాన్ చిత్రం పఠాన్ తర్వాత షారుక్ ఖాన్ రేంజ్ ఏంటో చెప్పకనే చెబుతుంది. తొలి రోజు కలెక్షన్ల అంచనాకు వస్తే.. హిందీలో 65 కోట్ల రూపాయలు, తమిళంలో 5 కోట్ల రూపాయలు, తెలుగులో 5 కోట్లకుపైగా షేర్ వసూలు చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం ఇండియాలో 85 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇక జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనాను పరిశీలిస్తే.. ఈ చిత్రం ఇండియాలో 85 కోట్ల కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 125 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమా కొద్ది రోజుల్లో పఠాన్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











