Jawan జవాన్ బాక్సాఫీస్ సంచలనం.. 1100 కోట్ల మ్యాజిక్ ఫిగర్ చేరువగా.. ఒకే ఏడాదిలో టాప్ లేపిన షారుక్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ హిందీ సినిమా పరిశ్రమలో అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో రెండు భారీ బ్లాక్ బస్టర్ సినిమాలను ఇవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేశాడు. 2023 సంవత్సరంలో 1000 కోట్లకుపైగా రెండుసార్లు కలెక్షన్లను రాబట్టిన హీరోగా రికార్డు సృష్టించాడు. జవాన్ సృష్టించిన రికార్డుల వివరాల్లోకి వెళితే..
వరుస ఫ్లాపుల నుంచి
గతంలో వరుస ఫ్లాప్‌లతో సతమతమైన షారుక్ ఖాన్ 2023 సంవత్సరంలో రిపబ్లిక్ డే కానుకగా పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాక్సాఫీస్ వద్ద పఠాన్ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమా కలెక్షన్లను మాత్రమే కాకుండా షారుక్ ఖాన్‌ను మళ్లీ సూపర్ స్టార్ రేంజ్‌కు తీసుకొచ్చింది. పఠాన్ సినిమా అందించిన ఉత్సాహంతో కృష్ణాష్టమి కానుకగా జవాన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

జవాన్ కలెక్షన్లు
జవాన్ మూవీ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ మూవీ తొలి వారంలో 390 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండోవారంలో ఈ సినిమా 137 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. మూడోవారం 56 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 584 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. హిందీలో 525 కోట్ల రూపాయలు, తెలుగులో 29 కోట్ల రూపాయలు, తమిళంలో 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
పఠాన్ రికార్డును అధిగమించిన జవాన్
ఇక హిందీ సినిమా పరిశ్రమలో పఠాన్ 543 కోట్ల రూపాయాలతో టాప్ గ్రాస్ కలెక్షన్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఇక జవాన్ చిత్రం పఠాన్ రికార్డులను అధిగమించింది. ఇప్పటి వరకు జవాన్ సినిమా 584 కోట్ల రూపాయలతో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో 600 కోట్ల క్లబ్‌లో చేరేందుకు రెడీ అవుతున్నది.
జవాన్ 23వ రోజు కలెక్షన్లు
ఇక జవాన్ చిత్రం గత 22 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓవర్సీస్‌లో 344 కోట్ల రూపాయలు, ఇండియాలో 700 కోట్ల గ్రాస్ రూపాయలను వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1043 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. త్వరలోనే ఈ సినిమా 1100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.

పఠాన్ ఆల్ టైమ్ రికార్డులు
షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 130 మిలియన్ డాలర్లు అంటే 1050 కోట్ల రూపాయలు, ఇండియాలో 543 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1043 కోట్ల రూపాయలు, ఇండియాలో 583 కోట్ల రూపాయలు రాబట్టింది. 23వ రోజున పఠాన్ ఆల్ టైమ్ రికార్డులను జవాన్ అధిగమించడం ఖాయంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











