twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jayeshbhai Jordaar collections రణ్‌వీర్ సింగ్ మూవీపై కేజీఎఫ్2 భారీ దెబ్బ.. ఆర్జున్ రెడ్డి హీరోయిన్ ఆశలు ఆవిరి

    |

    బాలీవుడ్‌లో భారీ బడ్జెట్, అగ్ర నటుల చిత్రాలకు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించకపోవడంపై హిందీ సినిమా పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన నమోదు కావడంతో ట్రేడ్ వర్గాల్లో అభద్రతాభావం కనిపిస్తున్నది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన జయేష్‌భాయ్ జోర్దార్ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడానికి తంటాలు పడుతున్నది. ఈ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

    షాలిని పాండే బాలీవుడ్ ఎంట్రీ

    షాలిని పాండే బాలీవుడ్ ఎంట్రీ

    బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణ సారధ్యంలో రణ్‌వీర్ సింగ్ నటంచిన జయేష్‌భాయ్ జోర్దార్ చిత్రం శుక్రవారం రిలీజైంది. ఈ చిత్రం ద్వారా అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. మహిళల గర్భ విచ్చిన్నం (అబార్షన్లు) అనే సున్నితమైన అంశంతో సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆశపెట్టుకొన్న షాలిని పాండే తాజా కలెక్షన్లతో ఆశలు ఆవిరి అయ్యాయనే మాట నెటిజన్లలో వినిపిస్తున్నది.

    జయేష్‌భాయ్ జోర్దార్ మూడో రోజు కలెక్షన్లు

    జయేష్‌భాయ్ జోర్దార్ మూడో రోజు కలెక్షన్లు

    జయేష్ జోర్దార్ చిత్రం తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద పెద్దగా స్పందన కనిపించలేదు. శుక్రవారం 3.25 కోట్లు సాధించింది. వీకెండ్‌లో అంటే.. శని, ఆదివారాల్లో ఈ చిత్రం ఓ మోస్తారు వసూళ్లను సాధించింది. శనివారం 4 కోట్లకుపైగానే, ఆదివారం 4.75 కోట్లు రాబట్టింది. దాంతో మూడు రోజుల్లో కేవలం 12 కోట్ల మేర వసూళ్లను సాధించింది.

    బుద్ద పౌర్ణిమ సెలవు కావడంతో

    బుద్ద పౌర్ణిమ సెలవు కావడంతో

    జయేష్‌భాయ్ జోర్దార్ చిత్రం సోమవారం సాధించే వసూళ్లపైనే భారీగా ఆశలు ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో సోమవారం బుద్ద పూర్ణిమ సందర్భంగా సెలవు పాటిస్తున్నారు. సెలవు రోజున ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉంటాయనే ఊహాగానాలతో ట్రేడ్ వర్గాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లు వసూలు చేస్తుందనే విషయం ఆసక్తిగా మారింది.

    బాలీవుడ్ మూవీస్‌పై కేజీఎఫ్2 ఆధిపత్యం

    బాలీవుడ్ మూవీస్‌పై కేజీఎఫ్2 ఆధిపత్యం

    ఇక బాలీవుడ్‌ సినిమాలపై KGF Chapter 2 చిత్రం అధిపత్యం కొనసాగిస్తున్నది. ఈ సినిమా 5వ వారం తర్వాత కూడా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం శుక్రవారం 1.23 కోట్లు, శనివారం 2.14 కోట్లు, ఆదివారం 2.98 కోట్ల వసూళ్లు సాధించింది. దాదాపు కొత్త సినిమాలకు ధీటుగా ఈ సినిమా వసూళ్లను సాధిస్తున్నది.

    బాలీవుడ్ చిత్రాలపై సౌత్ సినిమాల దెబ్బ

    బాలీవుడ్ చిత్రాలపై సౌత్ సినిమాల దెబ్బ

    బాలీవుడ్‌పై దక్షిణాది చిత్రాల అధిపత్యం కొనసాగుతున్నది. RRR, కేజీఎఫ్2 చిత్రాలు భారీగా వసూళ్లను సాధించాయి. హిందీ వెర్షన్‌కు చెందిన ఈ సినిమాలు ఉత్తరాదిలో రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టాయి. RRR, కేజీఎఫ్2 చిత్రాలు 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడం విశేషంగా మారింది. ఇటీవల రిలీజైన బాలీవుడ్ చిత్రాలను కేజీఎఫ్2 చిత్రం భారీగా దెబ్బ తీసిందనే చెప్పాల్సి ఉంటుంది.

    English summary
    Jayeshbhai Jordaar day 3 collections: KGF Chapter 2 overtakes bollywood. Taran Adarsh tweeted that, #JayeshbhaiJordaar struggles in its opening weekend... The much-needed jump on Day 2 and 3 was missing... The going seems tough on weekdays, looking at the trending... Fri 3.25 cr, Sat 4 cr, Sun 4.75 cr. Total: ₹ 12 cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X