ప్చ్...నిన్నటిదాకా నాగచైతన్య, ఇప్పుడు నాని

By Srikanya

హైదరాబాద్ : సినిమా విడుదల కాకుండా వాయిదాలు మీద వాయిదాలు వేసుకుంటూ వస్తుందంటే మార్కెట్లో ఆ చిత్రంపై క్రేజ్ తగ్గిపోతుంది. రిలీజ్ ఏదో మెక్కుబడికి జరిగినట్లు జరుగుతుంది. ఈ మధ్యన అలాంటి సమస్య నాగచైతన్య చిత్రం ఆటోనగర్ సూర్య ఎదుర్కొంది. ఇప్పుడు అదే సమస్యతో నాని సమతమతమవుతున్నాడు. నాని తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తూ, అమలా పాల్, రాగిణి ద్వివేది హీరోయిన్స్ గా నటించిన సినిమా 'జెండాపై కపిరాజు'. చాలా కాలంగా ఈ సినిమాకి రిలీజ్ తేదీలుప్రకటించటం, అవేమో వాయిదా పడడం జరుగుతూ వస్తోంది.

అయితే రీసెంట్ గా ఈ చిత్రం యూనిట్ ... ఆగష్టు 8వ తేదీని విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే మళ్లీ వాయిదా పడింది. ప్రస్తుతం ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో వినపడుతున్న లెక్కలు ప్రకారం ఈ నెలాఖరుకు విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. బిజినెస్ సమస్యలతో చిత్రం విడుదల ఆపినట్లు తెలుస్తోంది. తమిళంలోనూ ఈ చిత్రం వెర్షన్ విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఆ ఎఫెక్టు ఇక్కడ బిజినెస్ పై పడుతోంది.

Jenda Pai Kapiraju’s release postponed yet again

నాని మాట్లాడుతూ ''మనల్ని మనం సరిదిద్దుకుంటే ప్రపంచం సరైన స్థితిలో ఉంటుందనే అంశంపై నడిచే సినిమా ఇది. తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. సమాజానికి సందేశాన్నిచ్చే ఇలాంటి చిత్రంలో పనిచేయడం ఆనందంగా ఉంది. సినిమాలో మూడు నిమిషాలు ఉండే పోరాట సన్నివేశాన్ని 24 రోజులు చిత్రీకరించాం. ఇప్పుడు దాన్ని తెరపై చూసుకుంటే ఆ కష్టమంతా మరచిపోయాను''అని చెప్పారు.

''తెలుగు తెరపై త్వరలో ఓ మంచి సినిమాను విడుదల చేయబోతున్నాం. జీవీ ప్రకాష్‌కుమార్‌ అందించిన సంగీతానికి మంచి స్పందన వస్తోంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు నిర్మాణ సంస్థకు చెందిన మల్టీడైమన్షన్‌ వాసు.

వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై కె. శ్రీనివాసన్ నిర్మిస్తున్న "జెండాపైకపిరాజు'' చిత్రాన్ని మల్టిడైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సమర్పిస్తున్నారు. శివబాలాజీ, తనికెళ్లభరణి, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రధారులు. .ఆహుతి ప్రసాద్‌, శివబాలాజీ, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్‌, కూర్పు: ఫాజల్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X