twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్ రిపోర్ట్ : జెర్సీ ఓవర్సీస్ ప్రీమియర్ షో కలెక్షన్స్.. ఆ చిత్రాలతో పోల్చుకుంటే!

    |

    నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది పరాజయాల నుంచి తిరిగి పుంజుకుని అద్భుత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.తొలి షో నుంచే జెర్సీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ కూడా ఈ చిత్రాన్ని మంచి రివ్యూలు ఇస్తున్నారు. జెర్సీ చిత్రంలో నాని నటన, ఎమోషన్స్ తో వన్ మాన్ షో చేశాడని అంటున్నారు. పాజిటివ్ రిపోర్ట్స్ తో జెర్సీ చిత్రానికి ట్రేడ్ విశ్లేషకులు భారీ వసూళ్ళని అంచనా వేస్తున్నారు. యూఎస్ ప్రీమియర్ షోల వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

    యూఎస్ ప్రీరిలీజ్ బిజినెస్

    యూఎస్ ప్రీరిలీజ్ బిజినెస్

    నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రంపై ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. నాని ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో మెప్పించబోతున్నాడని అంతా భావించారు. అనుకున్న విధంగా జెర్సీ చిత్రంలో నాని నటనతో చెలరేగిపోయాడు. ఇదిలా ఉండగా నాని చిత్రాలు యుఎస్ లో బాగా రాణిస్తుంటాయి. దాదాపుగా నాని హిట్ చిత్రాలన్నీ యుఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ వసూళ్ళని రాబట్టినవే. జెర్సీ చిత్రాన్ని బ్లూ స్కై సినిమాస్ సంస్థ 3. 5 కోట్లకు యుఎస్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకుంది.

     ప్రీమియర్ షో వసూళ్లు

    ప్రీమియర్ షో వసూళ్లు

    నాని గత చిత్రాలతో పోల్చుకుంటే యూఎస్ లో జెర్సీ చిత్రం వసూళ్లు కాస్త స్లోగానే మొదలయ్యాయి అని చెప్పొచ్చు. ప్రీమియర్ షోల రూపంలో జెర్సీ చిత్రం 1,42,640 డాలర్లు రాబట్టింది. దాదాపు 130 లొకేషన్ లలో జెర్సీ చిత్ర ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. నాని నటించిన కృష్ణార్జున యుద్ధం చిత్రం ప్రీమియర్ షోల రూపంలో 1.64 లక్షల డాలర్లు రాబట్టింది. నేను లోకల్ చిత్రం 1.60 లక్షల డాలర్లు రాబట్టింది. ఈ చిత్రాలతో పోల్చుకుంటే జెర్సీ ప్రీమియర్ వసూళ్లు కాస్త తక్కువే.

    పుంజుకునే అవకాశం

    పుంజుకునే అవకాశం

    యుఎస్ లో నాని చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. జెర్సీ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్, అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యూఎస్ వసూళ్లు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇండియన్ మార్కెట్, తెలుగు రాష్ట్రాల్లో జెర్సీ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ అంచనా వేస్తున్నారు. నాని క్రికెటర్ పాత్రలో కంటతడి పెట్టించే విధంగా నటించాడని అంటున్నారు.

    టార్గెట్ ఎంతంటే

    టార్గెట్ ఎంతంటే

    జెర్సీ చిత్ర థియేట్రికల్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల వరకు జరిగింది. పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి బయ్యర్లంతా మంచి లాభాలని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెర్సీ చిత్రం ఏ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందనేది తొలిరోజు వసూళ్లనిబట్టి ఓ అంచనాకు రావచ్చు. ప్రస్తుతానికి వస్తున్న టాక్, అంచనాలని బట్టి జెర్సీ చిత్రం నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతోందని అంటున్నారు.

    English summary
    Jersey box office collection in US premieres: Nani film starts on good note. Jersey movie released today worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X