‘జెర్సీ’ కలెక్షన్ రిపోర్ట్: ఆరోసారి యూఎస్ఏ బాక్సాఫీస్ దద్దరిల్లే హిట్టు కొట్టిన నాని!
Recommended Video
తన అద్భుతమైన నటనతో కేవలం లోకల్ ప్రేక్షకులనే కాదు... యూఎస్ఏలో ఉండే తెలుగు వారి అభిమానం కూడా చూరగొన్న హీరో నాని... అక్కడి బాక్సాఫీస్ షేక్ చేయగల సత్తా ఉన్న అతికొద్దిమంది హీరోల లిస్టులో చాలా రోజుల క్రితమే చోటు దక్కించుకున్నాడు. తాజాగా ఈ నేచురల్ స్టార్ 'జెర్సీ' సినిమాతో మరో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు.
ఏప్రిల్ 19న విడుదలైన 'జెర్సీ' అమెరికాలో సూపర్ డూపర్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. తాజాగా ఈ చిత్రం అక్కడ 1 మిలియన్ మార్కును అందుకుని సత్తా చాటింది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ మూవీ ఈ ఫీట్ సాధించడం విశేషం.

యూఎస్ఏ ఫస్ట్ వీకెండ్
యూఎస్ఏలో నాని సినిమాలకు మంచి డిమాండ్ ఉండటంతో ఈ చిత్రాన్ని అక్కడ దాదాపు 140 లొకేషన్లలో విడుదల చేశారు. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఈ మూవీ ఇక్కడ $911k వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

5వ రోజుతో 1 మిలియన్
వీకెండ్ పూర్తయ్యక సాధారణంగానే కలెక్షన్స్ కాస్త డ్రాప్ అయ్యాయి. సోమవారం $43,381 వసూలు చేయడంతో 4 డేస్ టోటల్ $956,805 రీచ్ అయింది. మంగళవారం ‘జెర్సీ' $50k పైగా వసూలు చేయడంతో 1 మిలియన్ మార్క్ అందుకుంది.

ఆ రికార్డును బద్దలు కొట్టడం ఖాయం
యూఎస్ఏలో నాని కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ ‘భలే భలే మగాడివోయ్'. ఈ చిత్రం ఇక్కడ లైఫ్ టైమ్ $1.43 మిలియన్ రాబట్టింది. అయితే ‘జెర్సీ' కేవలం ఐదు రోజుల్లోనే 1 మిలియన్ అందుకోవడంతో త్వరలోనే ఆ రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

6వ సారి అమెరికా బాక్సాఫీస్ దద్దరిల్లే హిట్టు కొట్టిన నాని!
నాని కెరీర్లో ‘జెర్సీ' 6వ 1 మిలియన్ మూవీ. ఇంతకు ముందు ఆయన నటించిన ఈగ, భలే భలే మగాడివోయ్, ఎంసీఏ, నిన్నుకోరి, నేను లోక్ చిత్రాలు మిలియన్ డాలర్ చిత్రాలుగా నిలిచాయి. అయితే జెర్సీ వీటన్నింటినీ మించిన హిట్ కాబోతోంది.

జెర్సీ
జెర్సీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరిశీలిస్తే ఈ చిత్రం రైట్స్ రూ. 26 కోట్లకు అమ్మగా... ఫస్ట్ వీకెండ్(3 డేస్) నాటికే రూ. 15 కోట్లకుపైగా షేర్ రాబట్టింది. సెకండ్ వీకెండ్ నాటికి ఈ మూవీ లాభాల్లోకి వెళుతుందని అంచనా వేస్తున్నారు నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించగా.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.


Click it and Unblock the Notifications











