twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    11 డేస్ కలెక్షన్ రిపోర్ట్: ‘జెర్సీ’ పరిస్థితేంటి? అవెంజర్స్ దెబ్బ పడిందా?

    |

    Recommended Video

    Jersey Movie 11 Days Collections Report || Filmibeat Telugu

    నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'జెర్సీ' చిత్రం తొలి రోజు నుంచే సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి ప్రశంసలు అందడంతో పాటు మంచి రేటింగ్ వచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, ఎమోషనల్ కంటెంట్ ఉండటంతో ప్రేక్షకాదరణ పొందుతోంది.

    దీంతో ఫస్ట్ వీకెండ్ నాని నటించి ఈ చిత్రం రూ. 15 కోట్లకుపైగా షేర్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. అయితే బరిలో 'జెర్సీ'తో పాటు కాంచన కూడా ఉండటం కలెక్షన్ల మీద కాస్త ప్రభావం పడింది. దీనికి తోడు సెకండ్ వీకెండ్ అవెంజర్స్-ది ఎండ్ గేమ్ రిలీజ్ కావడం కలెక్షన్ల మీద ఎఫెక్ట్ చూపింది.

    11 డేస్ కలెక్షన్ రిపోర్ట్

    11 డేస్ కలెక్షన్ రిపోర్ట్

    సోమవారంతో బాక్సాఫీస్ వద్ద 11 డేస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పాయింటుకు చేరుకుంది. రెండు వారాలు పూర్తయితే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని, మూడో వారాంతం లాభాల్లోకి వెళుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని ఏరియాల్లో కలిపి జెర్సీ రూ. 25.09 కోట్లు వసూలు చేసింది.

    ఏరియా వైజ్ కలెక్షన్స్

    ఏరియా వైజ్ కలెక్షన్స్

    జెర్సీ మూవీ నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్ రూ. 1.81 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 2.24 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 1.30 కోట్లు, కృష్ణ రూ. 1.29 కోట్లు, గుంటూరు రూ. 1.41 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 88 లక్షలు, నెల్లూరు రూ. 58 లక్షలు, రెస్టాఫ్ ఇండియా రూ. 2.08 కోట్లు, ఓవర్సీస్ రూ. 5 కోట్లు వసూలు చేసింది.

    ఆ సీన్ చేస్తున్నపుడు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. నిజమైన రైల్వే స్టేషన్‌లో.. నాని!ఆ సీన్ చేస్తున్నపుడు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. నిజమైన రైల్వే స్టేషన్‌లో.. నాని!

    లాభాలు రావాలంటే...

    లాభాలు రావాలంటే...

    ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 26 కోట్లకు అమ్మారు. ఏపీ, తెలంగాణలో రైట్స్ రూ. 20.10 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు రూ. 18.01 కోట్లు మాత్రమే వసూలైంది. అయితే రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లో మాత్రమే పెట్టుబడి తిరిగి వచ్చేసి లాభాల్లో ఉంది. థర్డ్ వీకెండ్ నాటికి అన్ని ఏరియాల్లోని డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటలోకి వెళ్లడం ఖాయం అంటున్నారు.

    అవెంజర్స్-ది ఎండ్ గేమ్ దెబ్బ పడిందా?

    అవెంజర్స్-ది ఎండ్ గేమ్ దెబ్బ పడిందా?

    సెకండ్ వీకెండ్ ‘జెర్సీ' కలెక్షన్లపై ‘అవెంజర్స్-ది ఎండ్ గేమ్' దెబ్బ పడింది. కేవలం జర్సీ మీద మాత్రమే కాదు... బాక్సాఫీసు బరిలో ఉన్న అన్ని చిత్రాలపై ఈ ప్రభావం పడింది. ఒక వేళ ఈ సినిమా ఈ వారం రాకపోయి ఉంటే ‘జెర్సీ' కలెక్షన్ల జోరు మరోలా ఉండేదేమో!

    English summary
    Jersey movie 11 days share Rs. 25 Cr. Jersey written and directed by Gowtham Tinnanuri which is produced by Suryadevar Naga Vamsi under his production banner Sithara Entertainments. The film stars Nani and Shraddha Srinath in the lead roles while Sanusha, Sathyaraj, Sampath Raj, Brahmaji, Viswant and Ronit Kamra play pivotal roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X