twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని మూవీకి డిమాండ్ ఉందా? ‘జెర్సీ’ యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్ రిపోర్ట్!

    |

    నేచురల్ స్టార్ నాని సినిమాలకు యూఎస్ఏలో మంచి డిమాండ్ ఉంది. అమెరికా బాక్సాఫీసు వద్ద 1 మిలియన్ డాలర్ సంపాదించగల సత్తా ఉన్న హీరోల్లో నాని ఒకరు. ఆయన నటించిన ఎంసీఏ, నేను లోకల్, నిన్నుకోరి లాంటి చిత్రాలు ఓవర్సీస్ మార్కెట్లో మంచి వసూళ్లు సాధించాయి.

    గతేడాది ఈ హీరో నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే 'జెర్సీ' మూవీతో నాని మళ్లీ ఫాంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? ప్రీమియర్ షోలకు రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉంది అనేది హాట్ టాపిక్ అయింది.

    యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్

    యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్

    అమెరికాలో ‘జెర్సీ' చిత్రాన్ని బ్లూస్కై సంస్థ విడుదల చేసింది. యూఎస్ టైమింగ్ ప్రకారం.... గురువారం సాయంత్రం 7 గంటల వరకు 112 లొకేషన్ల నుంచి 105,000 డాలర్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

    లొకేషన్ యావరేజ్ ఎంతంటే..

    లొకేషన్ యావరేజ్ ఎంతంటే..

    ఒక్కో లొకేషన్లో దాదాపు 940 డాలర్లు వసూలు చేసింది. ఇది అంత గొప్ప మొత్తం ఏమీ కాదని, ప్రీమియర్ షోలకు యావరేజ్ రెస్పాన్స్ వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్ నాటికి మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

    ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే

    ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే

    ‘జెర్సీ' మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 2019లో పాత్ బ్రేకింగ్ మూవీ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నాని పెర్ఫార్మెన్స్, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే కమర్షియల్‌గా చిత్రం ఏ స్థాయికి చేరుకుంటుంది అనేది ఫస్ట్ వీకెండ్ గడిస్తే కానీ చెప్పలేం.

    జెర్సీ

    జెర్సీ

    నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా 'మళ్ళీ రావా' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశి నిర్మించిన చిత్రం 'జెర్సీ'. సత్యరాజ్, రోనిత్ కమ్ర,రావు రమేష్, బ్రహ్మాజీ, శిశిర్ శర్మ, సంపత్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం: అనిరుద్ రవిచందర్, కెమెరా: సాను జాన్ వరుఘీస్ , ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటర్: నవీన్ నూలి.

    English summary
    Jersey movie USA premiers gross report. The movie collected $105,000 from 112 locs. Jersey is sports drama period film based on the sport of cricket written and directed by Gowtham Tinnanuri which is produced by Suryadevara Naga Vamsi under his production banner Sithara Entertainments. The film stars Nani who is referred to as Natural Super Star and Shraddha Srinath in the lead roles while Sathyaraj, Brahmaji and Ronit Kamra play pivotal roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X