నాని ‘జెర్సీ’ మూవీ ఫైనల్ రిపోర్ట్... లాభమా? నష్టమా?
Recommended Video
నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ 'జెర్సీ' బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. నాని కెరీర్లోనే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సినిమాను నిర్మించిన వారితో పాటు డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
అన్ని ఏరియాల్లోనూ లాభాలు నమోదు చేసినప్పటికీ... సీడెడ్ ఏరియా డిస్ట్రిబ్యూటర్ మాత్రం నష్టపాలయ్యాడు. నైజాం డిస్ట్రిబ్యూటర్ అత్యధిక లాభాలు తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా ఏరియాల వారు స్మాల్ ప్రాఫిట్స్‌తో గట్టెక్కారు. ఈ సినిమా విడుదలైన తర్వాత వారమే అవెంజర్స్-ది ఎండ్ గేమ్ రావడంతో వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది.

ఫస్ట్ వీకెండ్ అదుర్స్
ఫస్ట్ వీకెండ్ రూ. 15 కోట్లకుపైగా షేర్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. అయితే బరిలో 'జెర్సీ'తో పాటు ‘కాంచన' కూడా ఉండటం కలెక్షన్ల మీద కాస్త ప్రభావం పడింది. దీనికి తోడు సెకండ్ వీకెండ్ అవెంజర్స్-ది ఎండ్ గేమ్ రిలీజ్ కావడంతో వసూళ్లు మరింత ఎఫెక్ట్ అయ్యాయి.

రూ. 5.79 కోట్ల లాభంతో..
ఓవరాల్‌గా చూసుకుంటే ‘జెర్సీ' ఏపీ తెలంగాణ రైట్స్ రూ. 19.56 కోట్లకు అమ్మగా... రూ. 5.79 కోట్ల లాభంతో రూ. 25.35 కోట్లు వసూలు చేసింది. యూఎస్ఏ మార్కట్లో $1.3 మిలియన్ గ్రాస్ వసూలు చేయడం ద్వారా అక్కడ నాని సినిమా సత్తా మరోసారి చాటింది.

ఏరియా వైజ్ రిపోర్ట్
ఏరియా వైజ్ వసూళ్లు పరిశీలిస్తే... నైజాం రైట్స్ రూ. 7 కోట్లకు అమ్మగా రూ. 3.75 కోట్ల లాభంతో రూ. 10.75 కోట్ల షేర్ వసూలు చేసింది. వైజాగ్ ఏరియా రైట్స్ రూ. 2.5 కోట్లకు అమ్మగా రూ. 1.07 కోట్ల లాభం వచ్చింది. ఈస్ట్ గోదావరిలో రూ. 1.50 కోట్ల పెట్టుబడికి రూ. 54 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1.12 కోట్ల పెట్టుడికి రూ. 23 లక్షలు, గుంటూరులో 1.6 కోట్ల పెట్టుబడికి రూ. 32 లక్షలు, కృష్ణలో రూ. 1.5 కోట్ల పెట్టుబడికి రూ. 52 లక్షల లాభం నమోదు చేసింది. నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ కేవలం 20 వేల లాభంతో బయట పడగా... సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ రూ. 3.6 కోట్ల పెట్టుబడి పెట్టి రూ. 66 లక్షలు నష్టపోయాడు.

జెర్సీ
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా 'మళ్ళీ రావా' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశి నిర్మించిన చిత్రం 'జెర్సీ'. సత్యరాజ్, రోనిత్ కమ్ర,రావు రమేష్, బ్రహ్మాజీ, శిశిర్ శర్మ, సంపత్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం: అనిరుద్ రవిచందర్, కెమెరా: సాను జాన్ వరుఘీస్ , ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటర్: నవీన్ నూలి.


Click it and Unblock the Notifications











