Jetlee Day 2 Box Office Collection: ‘జెట్‌లీ’కి షాకింగ్ కలెక్షన్లు.. సత్య మూవీకి ఎన్ని కోట్లంటే?

Jetlee Box Office Collection: టాలీవుడ్‌లో కమెడియన్లు హీరోలుగా మారడం కొత్త విషయం కాదు. ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తూ ప్రముఖ కమెడియన్ సత్య 'జెట్ లీ' సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన సత్య, ఈసారి పూర్తి స్థాయి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ చిత్రాన్ని రితేష్ రానా (Ritesh Rana) తెరకెక్కించగా, ఇది కామెడీ- యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? రెండో రోజు కలెక్షన్లు ఎంత? ఈ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ కమెడియన్లలో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నాడు సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'జెట్ లీ'. సత్య సరసన రియా సింఘా హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, అజయ్, వైవా హర్ష, కబీర్ బేడీ, శ్రీనివాసరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కామెడీ-యాక్షన్ థ్రిల్లర్ గా డైరెక్టర్ రిథేష్ రానా తెరకెక్కించగా, ఈ సినిమాను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి, హేమలత నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి సమర్పించారు. ఇక సినిమాకు సంగీతాన్ని కాల భైరవ అందించగా, సినిమాటోగ్రఫీని సురేష్ సారంగం నిర్వహించారు. ఎడిటింగ్ బాధ్యతలను కార్తీక శ్రీనివాస్ చేపట్టగా, ప్రొడక్షన్ డిజైన్‌ను నార్ని శ్రీనివాస్ చూసుకున్నారు.

Jetlee Day 2 expected Box Office Worldwide Collection Satya Comedy Entertainer Box Office report

బడ్జెట్ విషయానికి వస్తే, 'జెట్ లీ' చిత్రాన్ని సుమారు రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు సమాచారం. చిన్న సినిమా అయినప్పటికీ, ప్రమోషన్ విషయంలో మేకర్స్ ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా సత్య తన స్టైల్‌లో చేసిన ఎంటర్టైన్మెంట్ ప్రమోషన్స్ సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చాయి. దీంతో రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.3.8 కోట్ల మేర బిజినెస్ జరగగా, ఇతర ప్రాంతాలు, ఓవర్సీస్ కలిపి మరో రూ.1.2 కోట్ల వరకు అంచనా ఉంది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.5 కోట్ల వరకు వెళ్లినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్. ప్రజాపతి అనే వ్యక్తి నిర్వహిస్తున్న బ్యాంక్ దివాళా తీస్తుంది. దాంతో అనేక కుటుంబాలు నష్టపోతాయి. ఈ మోసానికి హరీష్ చంద్రను కారణంగా చూపించి, ప్రజాపతి విదేశాలకు పారిపోతాడు. ఈ కేసును ఛేదించేందుకు ఏజెంట్ శివానీ రంగంలోకి దిగుతుంది. ప్రజాపతిని పట్టుకుని ఇండియాకు తీసుకువస్తుండగా, విమానంలో కథ కీలక మలుపు తిరుగుతుంది. అదే ఫ్లైట్‌లో అతడిని హతమార్చేందుకు పలు గ్రూపులు ప్రయత్నిస్తుంటాయి. కానీ, అక్కడ ఉన్న బ్లైండ్ డాక్టర్ వేదవ్యాస్ పాత్రలో సత్య ప్రవేశించడం కథను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. వేదవ్యాస్ పాత్ర ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అతని అసలు నేపథ్యం ఏమిటి? ప్రజాపతితో అతనికి ఉన్న సంబంధం ఏంటి?అనేది స్టోరీ.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. జెట్ లీ (Jetlee) కామెడీ-యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, 'జెట్ లీ' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1.28 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. ఇందులో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గ్రాస్ మొత్తం రూ.1.28 కోట్లుగా ఉండగా, నెట్ కలెక్షన్లు రూ.1.10 కోట్లకు చేరుకున్నాయి. ఇక ఓవర్సీస్ లో నుంచి 30 లక్షల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ కానీ ఆసక్తికర స్పందన అందుకుంటోంది. ముఖ్యంగా సత్య కామెడీ టైమింగ్, ఎంటర్‌టైనింగ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలుస్తోంది.

ఇక రెండో రోజు కలెక్షన్లు కాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. నేడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1.5 కోట్ల వరకు అందుకునే అవకాశముంది. ఇక ఓవర్సీర్ లో దాదాపు రూ. 20 -25 లక్షల వరకు అందుకునే అవకాశముంది. ఈ లెక్కన చూస్తే.. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా పెద్ద స్థాయిలో కలెక్షన్లు అవసరం. రాబోయే రోజుల్లో వర్డ్ ఆఫ్ మౌత్ మీదే సినిమా భవిష్యత్తు ఆధారపడనుంది. జెట్ లీ బాక్సాఫీస్ వద్ద స్టడీగా రన్ కొనసాగిస్తుందా? లేక కలెక్షన్లు పెంచుకుంటుందా? అన్నది వచ్చే రోజుల్లో స్పష్టమవుతుంది.

Read more about: satya jet lee box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X