Jetlee Day 3 Box Office Collection: సత్య మూవీకి దారుణమైన కలెక్షన్స్.. 3 రోజుల్లో ఇంతే.. హిట్ కావాలంటే మాత్రం!

Jetlee Box Office Collection: టాలీవుడ్‌లో కమెడియన్లు హీరోలుగా మారడం కొత్త ట్రెండ్ కాదు. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ప్రముఖ కమెడియన్ సత్య (Satya) 'జెట్ లీ' సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన కామెడీ టైమింగ్‌తో ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన సత్య, ఈసారి పూర్తి స్థాయి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ-యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు కలెక్షన్లు ఎంత? ఈ వివరాల్లోకి వెళితే..

ఇక 'జెట్ లీ'లో సత్య సరసన రియా సింఘా హీరోయిన్‌గా నటించగా, వెన్నెల కిషోర్, అజయ్, వైవా హర్ష, కబీర్ బేడీ, శ్రీనివాసరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ సమర్పకులుగా వ్యవహరించారు. సంగీతాన్నికాలభైరవ అందించగా, సినిమాటోగ్రఫీని సురేష్ సారంగం, ఎడిటింగ్‌ను కార్తీక శ్రీనివాస్ నిర్వహించారు.

Jetlee Day 3 expected Box Office Worldwide Collection Satya Comedy Entertainer Box Office report

బడ్జెట్ పరంగా చూస్తే, 'జెట్ లీ' చిత్రాన్ని సుమారు రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు తెలుస్తోంది. చిన్న సినిమా అయినప్పటికీ, ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా సత్య తన స్టైల్‌లో చేసిన ప్రమోషన్స్ సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చాయి. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.5 కోట్ల వరకు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ కోసం కనీసం రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.

కథ విషయానికి వస్తే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ప్రజాపతి అనే వ్యక్తి నిర్వహించే బ్యాంక్ దివాళా తీయడంతో అనేక కుటుంబాలు నష్టపోతాయి. ఈ మోసానికి హరీష్ చంద్రను కారణంగా చూపించి ప్రజాపతి విదేశాలకు పారిపోతాడు. ఈ కేసును ఛేదించేందుకు ఏజెంట్ శివానీ రంగంలోకి దిగుతుంది. ప్రజాపతిని ఇండియాకు తీసుకువస్తున్న సమయంలో విమానంలో కథ కీలక మలుపు తిరుగుతుంది. అదే ఫ్లైట్‌లో అతడిని చంపేందుకు పలు గ్రూపులు ప్రయత్నిస్తుంటాయి. ఈ సమయంలో బ్లైండ్ డాక్టర్ వేదవ్యాస్ పాత్రలో సత్య ఎంట్రీ ఇవ్వడం కథను మరింత ఆసక్తికరంగా మార్చుతుంది. వేదవ్యాస్ పాత్ర ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 'జెట్ లీ' సినిమా బాక్సాఫీస్ వద్ద మోస్తారు వసూళ్లతో కొనసాగుతోంది. విడుదలైన రెండో రోజుకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 3.05 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసింది. ఇందులో ఇండియా నెట్ రూ. 1.90 కోట్లు, ఇండియా గ్రాస్ రూ. 2.20 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్ నుంచి రూ. 0.85 కోట్లు రాబట్టింది. ఇక మొదటి రోజు ఈ సినిమా రూ. 1.11 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు రూ. 0.80 కోట్లకు పడిపోయింది. డే 2లో కలెక్షన్స్ భారీగా పడిపోయాయి.

ఇక వీకెండ్‌ ( సండే) కలెక్షన్లు పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. నేడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1 కోటి వరకు అందుకునే అవకాశముంది. ఇక ఓవర్సీర్ లో దాదాపు రూ. 20 లక్షల వరకు కలెక్షన్లు అందుకునే అవకాశముంది. ఈ లెక్కన చూస్తే.. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా భారీ మొత్తంలో కలెక్షన్లు అందుకోవాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తే.. బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే అని చెప్పాలి. చివరి ఎలా రిజల్ట్ వస్తుందో వేచి చూడాలి.

Read more about: satya JETLEE box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X