JETLEE Business: జెట్‌లీ మూవీ వరల్డ్ వైడ్ బిజినెస్.. కమెడియన్ సత్య సినిమా లాభాల్లోకి రావాలంటే?
ప్రస్తుతం టాలీవుడ్ కమెడియన్లలో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నాడు సత్య. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు. కమెడియన్‌గా నటిస్తూనే అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. గతంలో వివాహ భోజనంబు, మత్తు వదలరా సినిమాలలో హీరోగా నటించిన సత్య.. ఇప్పుడు మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అదే జెట్లీ. సమ్మర్ కానుకగా మే 1న ఈ సినిమా విడుదల కానుంది.
జెట్లీ తారాగణం
జెట్లీ మూవీలో సత్య సరసన రియా సింఘా హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, అజయ్, హర్ష చెముడు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి, హేమలత పెదమళ్లు సంయుక్తంగా జెట్లీ మూవీని నిర్మించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జెట్లీ మూవీకి కాలభైరవ సంగీతం అందిస్తుండగా.. సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో జెట్లీ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ వివరాల్లోకి వెళితే..

జెట్ల బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి జెట్ల మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఖర్చుపెట్టారు. ప్రమోషనల్ కార్యక్రమాలతో సినిమాపై ప్రేక్షకుల్లో బజ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సత్య కూడా తనదైన శైలిలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో అట్రాక్షన్‌గా నిలిచారు.
జెట్లీ థియేట్రికల్ బిజినెస్ అంచనా?
ఇక జెట్‌లీ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ మూవీకి బిజినెస్ జరగలేదని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే సొంతంగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నట్లుగా టాలీవుడ్ టాక్. అయితే తెలుగు రాష్ట్రాల్లో జెట్లీ మూవీ థియేట్రికల్ బిజినెస్ విలువ 3.8 కోట్ల రూపాయలు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో కలిపి 1.2 కోట్ల రూపాయల రేంజ్ బిజినెస్ వాల్యూ ఉండే అవకాశం ఉంది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా జెట్లీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విలువ 5 కోట్ల రూపాయల రేంజ్‌లో ఉంటుందని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. ఈ నేపథ్యంలో సత్య మూవీ లాభాల్లోకి రావాలంటే 10 కోట్ల రూపాయల రేంజ్‌లో గ్రాస్ రాబట్టాలని చెబుతున్నారు.
ఆసక్తికరంగా జెట్లీ ట్రైలర్
కాగా.. రిలీజ్‌కు కొద్దిగంటల ముందు జెట్లీ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. న్యూస్ రీడర్‌గా ఉన్న గెటప్ శ్రీను.. వార్తలు చదువుతూ కట్టప్ప ప్రజాపతిని నమ్ముకున్న వారికి ఫుట్‌పాతే గతి అంటూ అజయ్ విదేశాలకు పారిపోయినట్లు చూపిస్తారు. అయితే అజయ్‌కి సంబంధించిన కేసుని ఎంక్వైరీ చేస్తూ హీరోయిన్ రియా సింఘా ఎంట్రీ ఇస్తుంది. ఈ ఆపరేషన్ గురించి మీకు మాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అని సీరియస్‌గా ఎవరికో చెబుతుంది. ఇందులో సత్య .. వేదవ్యాస్ అనే రోల్ పోషిస్తున్నారు. ఓ ఫ్లైట్‌లో హీరోకి సిరెంజ్ లాంటి పెన్ను గుచ్చుకోవడంతో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ట్రైలర్‌తో ఈ సినిమాపై హైప్‌ను తెచ్చేందుకు ప్రయత్నించారు. మరి ఆ ఫ్లైట్‌లో ఏం జరిగింది? అజయ్ ఎందుకు విదేశాలకు పారిపోయాడు? హీరోయిన్ ఆపరేషన్ వెనుక సీక్రెట్ ఏంటీ? అనేది తెలియాలంటే మే 1న జెట్లీ సినిమా చూడాల్సిందే.


Click it and Unblock the Notifications