Jigarthanda DoubleX Collections నిరాశ పరిచిన జిగర్తాండ ఓపెనింగ్స్..ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX). దీపావళీ కానుకగా నవంబర్ 10వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా ప్రమోషన్స్ భారీ బజ్ క్రియేట్ చేసింది. జిగర్తాండ సిరీస్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) సినిమాకు సంబంధించి నటీనటుల పారితోషికం, ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్‌ను 65 కోట్లు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 36 కోట్ల రూపాయలు కాగా, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు 6 కోట్ల మేర అమ్ముడుపోయాయి.

Jigarthanda DoubleX day 1 Expected Collections worldwide: Here is complete box office Report

జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) సినిమాకు భారీ క్రేజ్, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన, అడ్వాన్స్ బుకింగ్‌కు రెస్పాన్స్ రావడంతో రికార్డు స్థాయిలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను తమిళనాడులో 1200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.ఏపీ, తెలంగాణలో కలిపి 500 స్క్రీన్లు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి 500 స్క్రీన్లలో ఓవర్సీస్‌లో 500 స్క్రీన్లలో విడుదల చేశారు. మొత్తంగా 2700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) సినిమాకు జపాన్ మూవీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. జపాన్ కంటే తక్కువ ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 1 కోటి రూపాయలకుపైగా వసూలు చేసింది. ఇక ఆక్యుపెన్సీ కూడా తొలి రోజు ఓ మాదిరిగా నమోదైంది.

Jigarthanda DoubleX day 1 Expected Collections worldwide: Here is complete box office Report

జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) ఆక్యుపెన్సీ విషయానికి వస్తే..తమిళ వెర్షన్‌కు 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అత్యధికంగా దుండిగల్‌లో 54 శాతం, మధురైలో 25 శాతం,చెన్నైలో 35 శాతం, వెల్లూరులో 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తెలుగు వెర్షన్ 20 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. గుంటూరులో అత్యధికంగా 35 శాతం, వైజాగ్‌లో 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళనాడులో సుమారుగా 5 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా 9 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేస్తుందని పేర్కొన్నారు. పబ్లిక్ టాక్ పెరిగితే వారాంతంలో కలెక్షన్లు పరిగే అవకాశం ఉంది.

Jigarthanda DoubleX day 1 Expected Collections worldwide: Here is complete box office Report

జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ లక్ష్యం ఉంది. ఈ సినిమా 70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్ట గలిగితే.. లేదా 36 కోట్లకుపైగా షేర్ వసూలు చేయగలిగితే లాభాల్లోకి ప్రవేశిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X