Jigarthanda DoubleX day 2 Collections రాఘవ లారెన్స్ డబుల్ ధమాకా.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
కొరియోగ్రాఫర్, యాక్టర్, పొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్, డైరెక్టర్,యాక్టర్ ఎస్‌జే సూర్య నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ తమిళనాడుతోపాటు ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లను రాబడుతున్నది. మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్న ఈ సినిమా దక్షిణాదిలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. 2014లో రూపొందిన జిగర్తాండ చిత్రానికి సిరీస్‌గా వచ్చిన ఈ సినిమా గత రెండు రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) మూవీ సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ ఓవరాల్‌గా 35 కోట్లకుపైగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు 6 కోట్లకు మేర అమ్మడం జరిగింది. ఈ సినిమా 37 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) మూవీకి రిలీజ్‌కు మంచి క్రేజ్ కనిపించడంతో రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను తమిళనాడులో 1200 స్క్రీన్లు, ఆంధ్రా, నైజాంలో 500 స్క్రీన్లు, కర్ణాటక, కేరళలో 500 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రపంపచవ్యాప్తంగా ఈ సినిమాను 2700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, ఆంధ్రా, నైజాంలో 1 కోటి రూపాయల గ్రాస్, ఇండియాలో 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లు, అలాగే ఓవర్సీస్‌లో 2.3 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.దాంతో ఈ సినిమా సుమారుగా 7 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) సినిమా ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. మార్నింగ్ షోకు 27 శాతంతో మొదలై మ్యాట్రీ సమయానికి పుంజుకొన్నది. మ్యాట్రీకి 40 శాతానికి పైగా, ఫస్ట్ షోకు 40 శాతం, సెకండ్ షోకు 50 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసుకొన్నది.తెలుగు వెర్షన్ సినిమా విషయానికి వస్తే..ఓవరాల్‌గా 20 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.
జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) సినిమా విషయానికి వస్తే.. తమిళంలో 4.5 కోట్ల నికరంగా 4.5 కోట్ల గ్రాస్, తెలుగులో 50 లక్షలు, హిందీలో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 60 లక్షల గ్రాస్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 70 కోట్ల గ్రాస్, 37 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











