Jigarthanda DoubleX 1st Week Collections: 36 కోట్ల సినిమా.. వారంలో దారుణంగా.. ఎంత రావాలో తెలిస్తే!
ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇప్పుడు హిట్ సినిమాలకు సీక్వెల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అందులో చాలా వరకూ ప్రేక్షకుల మెప్పును పొందడంతో ఇంకాస్త ఎక్కువగా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు వచ్చిన క్రేజీ సీక్వెల్ మూవీనే 'జిగర్తాండ డబుల్ ఎక్స్'. గతంలో వచ్చిన 'జిగర్తాండ'కు కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీపై ఆరంభం నుంచీ మంచి హైప్ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే ఇది తాజాగా విడుదలైంది. కానీ, మిక్స్‌డ్ టాక్ కారణంగా వసూళ్లను పెద్దగా రాబట్టడంలేదు. మరి 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ రిపోర్టు మీకోసమే!
తమిళ స్టార్లు కాంబినేషన్‌లో
రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య కలయికలో కార్తీక్ సుబ్బరాజు రూపొందించిన క్రేజీ సినిమానే 'జిగర్తాండ డబుల్ ఎక్స్'. కార్తీకేయన్ సంతానం, ఎస్ కథిరేశన్, అలంకార్ పాండ్యన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో, నిమిషా సజయన్, నవీన్ చంద్ర, సత్యన్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూర్చాడు.

ఈ సినిమా బిజినెస్ డీటేల్స్
క్రేజీ మల్టీస్టారర్‌గా వచ్చిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 30 కోట్లు బిజినెస్ అయింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది.
7వ రోజు తెలుగు వసూళ్లిలా
రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో రూపొందిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ ఎన్నో అంచనాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అంతగా రాలేదు. ఆ తర్వాత కూడా డౌన్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా 7వ రోజు రూ. 9 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

7 రోజులకూ కలిపి ఎంత?
'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీకి తెలుగులో రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీపావళి సెలవులను సరిగా వాడుకోలేకపోయిన ఈ సినిమా.. ఆ తర్వాత కూడా సరైన రన్‌ను కొనసాగించలేకపోయింది. ఫలితంగా 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ నైజాంలో రూ. 99 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 1.23 కోట్లు కలిపి రూ.2.22 కోట్లు షేర్, రూ. 4.20 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
యాక్షన్ జోనర్‌లో రూపొందిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీకి వారం రోజుల్లో తమిళనాడులో రూ. 29.00 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.20 కోట్లు, కర్నాటకలో రూ. 2.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.30 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 43.95 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 22.50 కోట్లు షేర్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 35 కోట్లు బిజినెస్ చేయగా.. 7 రోజుల్లో రూ. 22.50 కోట్లు రాబట్టింది. అంటే 36 కోట్లు టార్గెట్‌కు ఇంకా రూ. 13.50 కోట్లు వెనుకబడి ఉంది. తెలుగులో ఈ చిత్రానికి రూ. 5 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 5.50 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీకి ఇంకా రూ. 3.28 కోట్లు వసూలు కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











