Jigarthanda DoubleX 2 Days Collections: పెరిగిన వసూళ్లు.. మొత్తం అన్ని కోట్లు.. కార్తీ మూవీ కంటే!
సినీ పరిశ్రమలో సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ వస్తుంటాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే భారీ బజ్‌ను ఏర్పరచుకుని రిలీజ్ అవుతుంటాయి. అలాంటి కోవలోకి చెందిన చిత్రమే 'జిగర్తాండ డబుల్ ఎక్స్'. 2014లో వచ్చిన 'జిగర్తాండ'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీపై ఆరంభం నుంచీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అందుకు తగ్గట్లుగానే ఇది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, మిక్స్‌డ్ టాక్ కారణంగా వసూళ్లను పెద్దగా రాబట్టడంలేదు. ఈ నేపథ్యంలో 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ రెండు రోజుల వసూళ్లను మీరే చూడండి!

జిగర్తాండ డబుల్ ఎక్స్‌గా రెడీ: రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన చిత్రమే 'జిగర్తాండ డబుల్ ఎక్స్'. కార్తీకేయన్ సంతానం, ఎస్ కథిరేశన్, అలంకార్ పాండ్యన్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో షైన్ టామ్ చాకో, నిమిషా సజయన్, నవీన్ చంద్ర, సత్యన్‌లు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూర్చారు.

ఈ సినిమా బిజినెస్ డీటేల్స్: భిన్నమైన కథాంశంతో రూపొందిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 30 కోట్లు బిజినెస్ అయింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది.

2వ రోజు తెలుగు వసూళ్లిలా: లారెన్స్, ఎస్‌జే సూర్య కాంబోలో రూపొందిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ ఎన్నో అంచనాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అంతగా రాలేదు. కానీ రెండో రోజు మాత్రం రెస్పాన్స్ కాస్త పెరిగింది. ఫలితంగా ఈ సినిమా రెండో రోజు రూ. 52 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.
2 రోజులకూ కలిపి ఎంత?: 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీకి తెలుగులో తక్కువగానే రెస్పాన్స్ వస్తోంది. రెండో రోజు మాత్రం కాస్త పెరిగినా నిరాశనే ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే రెండు రోజుల్లో దీనికి చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ నైజాంలో రూ. 46 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 52 లక్షలతో కలిపి రూ. 98 లక్షలు షేర్, రూ. 1.90 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: క్రేజీ కాంబోలో రూపొందిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీకి రెండు రోజుల్లో తమిళనాడులో రూ. 5.95 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.90 కోట్లు, కర్నాటకలో రూ. 65 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 45 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.40 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 10.35 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 5.25 కోట్లు షేర్‌ను వసూలు చేసింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 35 కోట్లు బిజినెస్ చేయగా.. 2 రోజుల్లో రూ. 5.25 కోట్లు రాబట్టింది. అంటే 36 కోట్లు టార్గెట్‌కు ఇంకా రూ. 30.75 కోట్లు వెనుకబడి ఉంది. తెలుగులో ఈ చిత్రానికి రూ. 5 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 5.50 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీకి ఇంకా రూ. 4.52 కోట్లు వసూలు కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











