Jigarthanda DoubleX 3 Days Collections: దీపావళికి ఢమాల్.. లారెన్స్ మూవీ తుస్.. అన్ని కోట్లు రావాలా!

ఈ మధ్య కాలంలో సౌతిండియాలో విభిన్నమైన కథలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అందులో కొన్ని సూపర్ హిట్ మూవీలకు సీక్వెల్‌గానూ తెరకెక్కుతోన్నాయి. ఇప్పుడు అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'జిగర్తాండ డబుల్ ఎక్స్'. గతంలో వచ్చిన 'జిగర్తాండ'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీపై ఆరంభం నుంచీ మంచి హైప్ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే ఇది తాజాగా విడుదలైంది. కానీ, మిక్స్‌డ్ టాక్ కారణంగా వసూళ్లను పెద్దగా రాబట్టడంలేదు. ఈ నేపథ్యంలో 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ మూడు రోజుల వసూళ్లను మీరే చూడండి!

డబుల్ డోస్‌తో వచ్చిన మూవీ:రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య కాంబోలో కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన క్రేజీ సినిమానే 'జిగర్తాండ డబుల్ ఎక్స్'. కార్తీకేయన్ సంతానం, ఎస్ కథిరేశన్, అలంకార్ పాండ్యన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో, నిమిషా సజయన్, నవీన్ చంద్ర, సత్యన్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు.

Jigarthanda DoubleX Movie 3 Days Box Office Collections

ఈ సినిమా బిజినెస్ డీటేల్స్:మల్టీస్టారర్ జోనర్‌లో వచ్చిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్లు, తమిళంతో సహా మిగిలిన అన్ని ప్రాంతాలూ కలిపి రూ. 30 కోట్లు బిజినెస్ అయింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిపింది.

3వ రోజు తెలుగు వసూళ్లిలా:లారెన్స్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో రూపొందిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ ఎన్నో అంచనాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అంతగా రాలేదు. ఇక, దీపావళి రోజు కూడా ఢీలా పడింది. ఫలితంగా ఈ సినిమా 3వ రోజు రూ. 46 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

3 రోజులకూ కలిపి ఎంత?:'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీకి తెలుగులో రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు. రెండో రోజు మాత్రం కాస్త పెరిగినా మూడో రోజు మాత్రం హాలీడే అడ్వాంటేజ్‌ను సరిగా వాడకోలేకపోయింది. ఫలితంగా 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ నైజాంలో రూ. 60 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 84 లక్షలతో కలిపి రూ.1.44 కోట్లు షేర్, రూ. 2.70 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Jigarthanda DoubleX Movie 3 Days Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:యాక్షన్‌ జోనర్‌లో రూపొందిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీకి మూడు రోజుల్లో తమిళనాడులో రూ. 13.05 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.70 కోట్లు, కర్నాటకలో రూ. 1.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.35 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 20.00 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 10.40 కోట్లు షేర్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 35 కోట్లు బిజినెస్ చేయగా.. 3 రోజుల్లో రూ. 10.40 కోట్లు రాబట్టింది. అంటే 36 కోట్లు టార్గెట్‌కు ఇంకా రూ. 25.60 కోట్లు వెనుకబడి ఉంది. తెలుగులో ఈ చిత్రానికి రూ. 5 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 5.50 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీకి ఇంకా రూ. 4.06 కోట్లు వసూలు కావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X