Jigra Collections: జిగ్రా 100 కోట్ల టార్గెట్.. ఆలియా భట్ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?
హిందీ సినిమా రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు వాయాకామ్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్ రూపొందించిన చిత్రం జిగ్రా. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, యువ హీరో వేదాంగ్ రైనా, దక్షిణాది నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తదితరులు నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఆలియా భట్, కరణ్ జోహర్, అపూర్వ మెహత, షాహీన్ భట్, సోమెశ్ మిశ్రా తదితరులు నిర్మించారు. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
జిగ్రా మూవీలో ఆలియా భట్ తప్పితే పెద్దగా స్టార్స్ ఎవరూ కనిపించలేదు. కానీ టాప్ టెక్నిషియన్స్ పనిచేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఆలియా భట్ ఈ ప్రమోషన్స్ భుజాన వేసుకొని ప్రచారం చేశారు. దాంతో ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 90 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 100 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. భారీ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని ఈ సినిమా ప్రారంభించింది.

జిగ్రా మూవీ ప్రమోషన్స్‌కు భారీగా రెస్సాన్స్ రావడంతో ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ క్రిటిక్స్ నుంచి రావడంతో ఆ తర్వాత ఓపెనింగ్స్ మందగించాయి. ఈ చిత్రం తొలి రోజున 4.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 6.5 కోట్ల రూపాయలు, 3వ రోజు 5.5 కోట్లు రాబట్టింది. తొలివారాంతంలో ఈ చిత్రం 16.5 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.
జిగ్రా మూవీ తొలి వారాంతం తర్వాత వసూళ్లు తగ్గాయి. ఈ సినిమా 4వ రోజు 1.75 కోట్లు, 5వ రోజు 1.5 కోట్లు, 6వ రోజు 1.25 కోట్లు, 7వ రోజు 1.5 కోట్లు, 8వ రోజు 1.25 కోట్లు, 9వ రోజు 1.7 కోట్లు, 10వ రోజు 2 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండోవారం తర్వా త పూర్తిగా కలెక్షన్లు పడిపోయాయి. 5 రోజుల్లో కేవలం 2 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా వసూలు చేసింది.

జిగ్రా ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచడంతో ఓవర్సీస్‌లో క్రేజీగా స్పందన కనిపించింది. ఈ సినిమా నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలిపి 3 మిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్లు అంటే సుమారుగా 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 30 కోట్ల రూపాయల నికర వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా ప్రతీకూల పరిస్థితుల్లోకి జారుకొన్నది.
జిగ్రా మూవీ అన్ని రకాల బిజినెస్‌ల ద్వారా 100 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా థియేట్రికల్ వాల్యూ కనీసం 60 కోట్లకుపైగా నికర వసూళ్లు రాబట్టాల్సింది. కానీ ఈ చిత్రం కేవలం 30 కోట్ల మేరనే వసూళ్లు సాధించింది. దాంతో ఈ మూవీ మొత్తంగా భారీ నష్టాలతో ముగిసే ఛాన్స్ కనిపిస్తున్నది. రెండు వారాలుగా ప్రదర్శించబడుతున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసినట్టే అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











