ఆలియా భట్‌కు భారీ ఎదురు దెబ్బ.. 90 కోట్ల టార్గెట్‌తో జిగ్రా.. ఎన్నికోట్ల కలెక్షన్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించి, నిర్మాతగా వ్యవహరించిన చిత్రం జిగ్రా. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు వాయాకామ్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్ రూపొందించిన చిత్రానికి వాసన్ బాలా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో యువ హీరో వేదాంగ్ రైనా, దక్షిణాది నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తదితరులు నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను సుమారుగా 80 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ ఖర్చుల కోసం 10 కోట్లకుపైగా ఖర్చు చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు సుమారుగా 90 కోట్ల రూపాయల వ్యయం అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో ఈ మూవీని 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Jigra Day 5 Box Office Collections Worldwide Alia Bhutt Movie Struggling at GBOC

ఈ సినిమా రిలీజ్‌కు ముందు ముంబై, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. సమంత, త్రివిక్రమ్, రష్మిక మందన్న, మహేష్ బాబు స్వయంగా రంగంలోకి దిగి ఈ సినిమా గురించి భారీగా ప్రమోషన్స్ చేశారు. అయినా ఈ సినిమా తెలుగులో గానీ, హిందీలో గానీ అంతగా వసూళ్లను నమోదు చేయలేకపోయింది.

జిగ్రా చిత్రం 100 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఈ సినిమా తొలి రోజు 4.5 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. రెండో రోజు ఈ చిత్రం 6.5 కోట్ల రూపాయలు, 3వ రోజు 5.5 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక నాలుగో రోజుఈ సినిమా దాదాపు 60 శాతం క్షీణించి 1.5 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Jigra Day 5 Box Office Collections Worldwide Alia Bhutt Movie Struggling at GBOC

ఇక 5 రోజు జిగ్రా కలెక్షన్ల విషయానికి వస్తే.. పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా 1 కోటి రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా సుమారుగా 19 కోట్లకు అటు ఇటుగా కలెక్ట్ చేస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ రకంగా కలెక్షన్లు వస్తే.. ఆలియా భట్‌కు భారీ దెబ్బే పడుతుందని అభిప్రాయపడుతున్నారు.

జిగ్రా సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం ఇంకా 80 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఈ మూవీ శాటిలైట్, ఓటీటీ, ఇతర డిజిటల్ రైట్స్ ద్వారా కొంత మేరకు బడ్జెట్‌ను రికవరీ చేసే అవకాశం ఉంది. ఇదే రకంగా వసూళ్లు కొనసాగితే.. భారీ నష్టాల్లో ముగిసే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితులు అభిప్రాయపడ్డుతున్నారు.

More from Filmibeat

Read more about: jigra alia bhatt box office
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X