Jigra Collections: జిగ్రా మూవీ రికార్డు ఓపెనింగ్స్.. ఆలియాభట్ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు వాయాకామ్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్ రూపొందించిన చిత్రం జిగ్రా. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, యువ హీరో వేదాంగ్ రైనా, దక్షిణాది నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తదితరులు నటించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లు ఎంత?
డ్రగ్స్ వాడకం కథాంశంగా యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఆలియా భట్, కరణ్ జోహర్, అపూర్వ మెహత, షాహీన్ భట్, సోమెశ్ మిశ్రా తదితరులు నిర్మించారు. ఈ మూవీకి పాజిటివ్ రివ్యూస్, ప్రేక్షకులను సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది. దాంతో ఈ చిత్రం గ్రాండ్‌గా ఓపెనింగ్స్ సాధించింది. ఇదే జోష్ కొనసాగితే మంచి వసూళ్లు నమోదయ్యే ఛాన్స్ ఉంది.

జిగ్రా మూవీలో ఆలియా భట్ తప్పితే పెద్దగా స్టార్స్ ఎవరూ కనిపించలేదు. కానీ టాప్ టెక్నిషియన్స్ పనిచేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఆలియా భట్ ఈ ప్రమోషన్స్ భుజాన వేసుకొని ప్రచారం చేశారు. దాంతో ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 90 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 100 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది.
ఆలియా భట్ మూవీని హిందీతోపాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్‌కు మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తున్నది. హిందీలో కూడా తొలి రోజు ఫర్వాలేదనే టాక్ వినిపించింది. హిందీలో 50 శాతం ఆక్యుపెన్సీ, తెలుగులో 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్, వరంగల్, వైజాగ్, గుంటూరులో సుమారుగా 50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
జిగ్రా మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే.. హిందీలో ఈ చిత్రం గ్రాండ్‌గా ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజు ఈ సినిమా సుమారుగా 4.5 కోట్ల నికరంగా 7 కోట్ల గ్రాస్, తెలుగులో 50 లక్షలు నికరంగా 1 కోటి రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. దాంో ఈ సినిమా ఇండియాలో 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











