Yatra 2 Movie 3 Days Collections: యాత్ర 2 మూవీకి షాక్.. 50 కోట్ల సినిమాకు ఇలానా.. 3 రోజుల్లో ఎంతంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్ మూవీల హవా కొనసాగుతూనే ఉంది. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ తరహా సినిమాలు రూపొందుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గతంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన 'యాత్ర' చిత్రానికి సీక్వెల్‌గా 'యాత్ర 2'ను తెరకెక్కించారు.

ఆ చిత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథతో వస్తే.. ఇది మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టోరీతో రూపొందింది. ఫలితంగా మంచి అంచనాలతో ఈ చిత్రం విడుదలైంది. మరి 'యాత్ర 2' మూవీకి 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు ఎంత వచ్చాయో మీరు కూడా చూసేయండి!

Jiiva Starrer Yatra 2 Movie 3 Days Worldwide Box Office Collections

వైఎస్ జగన్ కథతో యాత్ర 2: తమిళ స్టార్ జీవా ప్రధాన పాత్రలో రూపొందిన పొలిటికల్ మూవీనే 'యాత్ర 2'. క్రియేటివ్ డైరెక్టర్ మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ క్రేజీ సీక్వెల్‌కు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించాడు. ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మమ్మట్టి, వైఎస్ భారతిగా కేతకీ నారాయన్ నటించారు.

Jiiva Starrer Yatra 2 Movie 3 Days Worldwide Box Office Collections

యాత్ర 2 బిజినెస్ ఎంత?: పొలిటికల్ బయోపిక్‌గా వచ్చిన 'యాత్ర 2' సినిమాపై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన ప్రచారం చిత్రాలకు స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమా హక్కులకు మంచి పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 10 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

Jiiva Starrer Yatra 2 Movie 3 Days Worldwide Box Office Collections

3వ రోజు తెలుగు వసూళ్లు: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కథతో రూపొందిన 'యాత్ర 2' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అనుకున్న విధంగానే రెస్పాన్స్ తక్కువగానే లభించింది. ఆ తర్వాత కూడా ఇది క్రమంగా డౌన్ అవుతూనే వస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు మూడో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 35 లక్షలు షేర్ మాత్రమే వసూలైంది.

Jiiva Starrer Yatra 2 Movie 3 Days Worldwide Box Office Collections

మూడు రోజుల్లో ఎంతంటే: రాజకీయ నేపథ్యంతో రూపొందిన 'యాత్ర 2' సినిమాకు టాక్‌కు అనుగుణంగానే తక్కువ స్పందనే వచ్చింది. దీనికితోడు రవితేజ 'ఈగల్' మూవీ నుంచి తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా 'యాత్ర 2' మూవీకి మూడు రోజుల్లో తక్కువ స్పందనే వచ్చింది. అలా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.05 కోట్లు షేర్, రూ. 4.00 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.

Jiiva Starrer Yatra 2 Movie 3 Days Worldwide Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: జీవా ప్రధాన పాత్రలో నటించిన 'యాత్ర 2' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ డల్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ పొలిటికల్ సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 20 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 3 రోజుల్లో రూ. 2.55 కోట్లు షేర్, 4.90 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

Jiiva Starrer Yatra 2 Movie 3 Days Worldwide Box Office Collections

టార్గెట్‌ ఇలా.. ఎంత రావాలి?: 'యాత్ర 2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 10.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 11 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడు రోజుల్లో దీనికి రూ. 2.55 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇది హిట్ కావాలంటే మరో రూ. 8.45 కోట్లు షేర్ రాబట్టాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X