Yatra 2 Movie 4 Days Collections: సండే షాకింగ్ కలెక్షన్లు.. 4 రోజుల్లో అన్ని కోట్లు.. ఇంకా అంత రావాలా!
టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ, అందులో అతి తక్కువ చిత్రాలు మాత్రమే విడుదలకు ముందే హైప్‌ను క్రియేట్ చేసుకున్నాయి. అలాంటి వాటిలో 'యాత్ర 2' ఒకటి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథతో వచ్చిన 'యాత్ర' మూవీకి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్టోరీని చూపించారు. అయితే, ఈ మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా దీనికి ప్రేక్షకుల నుంచి ఆశించిన రీతిలో స్పందన రావట్లేదు. మరి 'యాత్ర 2' మూవీకి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు ఎంత వచ్చాయో మీరు కూడా చూడండి!
పొలిటికల్ స్టోరీతో యాత్ర 2:వైఎస్ జగన్ స్టోరీతో రూపొందిన పొలిటికల్ మూవీనే 'యాత్ర 2'. జీవా ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ క్రేజీ సీక్వెల్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మమ్మట్టి, వైఎస్ భారతిగా కేతకీ నారాయన్ చేశారు.

యాత్ర 2 బిజినెస్ ఎంత?:ఓ ముఖ్యమంత్రి కథతో రూపొందిన చిత్రం కావడంతో 'యాత్ర 2' సినిమాపై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన ప్రచారం చిత్రాలకు స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమా హక్కులకు మంచి పోటీ ఏర్పడింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 10 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ అయింది.
4వ రోజు తెలుగు వసూళ్లు:పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో.. హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'యాత్ర 2' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ అనుకున్న దానికంటే తక్కువే వచ్చాయి. ఆ తర్వాత వీకెండ్‌లో కూడా ఇది క్రమంగా డౌన్ అవుతోంది. సండే పెరుగుతుంది అనుకున్నా అంతగా రాణించలేదు. ఫలితంగా దీనికి రూ. 30 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

నాలుగు రోజుల్లో ఎంతంటే:జీవా ప్రధాన పాత్రలో నటించిన 'యాత్ర 2' సినిమాకు టాక్‌కు అనుగుణంగానే తక్కువ స్పందనే వచ్చింది. దీనికితోడు రవితేజ 'ఈగల్' మూవీ నుంచి దీనికి పోటీ బాగా వచ్చింది. ఫలితంగా 'యాత్ర 2' మూవీకి నాలుగు రోజుల్లో తక్కువ స్పందనే వచ్చింది. అలా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ రూ. 2.35 కోట్లు షేర్, రూ. 4.60 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన 'యాత్ర 2' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ డల్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ పొలిటికల్ సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 33 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 22 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 4 రోజుల్లో రూ. 2.90 కోట్లు షేర్, 5.55 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:'యాత్ర 2' సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 10.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 11 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు రోజుల్లో దీనికి రూ. 2.90 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇది హిట్ కావాలంటే మరో రూ. 8.10 కోట్లు షేర్ రాబట్టాలి.


Click it and Unblock the Notifications











