Yatra 2 Movie 6 Days Collections: యాత్ర 2 ఖేల్ ఖతం.. 50 కోట్ల మూవీకి ఇలానా.. కోట్ల నష్టాలు తప్పవా!
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. దీంతో రాజకీయాలు అక్కడ బాగా వేడెక్కిపోతున్నాయి. ఫలితంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. అలా ఇటీవలే విడుదలైన చిత్రమే 'యాత్ర 2'. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కథతో రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, దీనికి రెస్పాన్స్ ఆశించిన విధంగా రావడం లేదు. దీంతో కలెక్షన్లు తక్కువగా వస్తున్నాయి. మరి 'యాత్ర 2' మూవీకి 6 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరు కూడా చూడండి!
వైఎస్ జగన్ స్టోరీతో మూవీ:వైఎస్ జగన్ కథతో రూపొందిన పొలిటికల్ సినిమానే 'యాత్ర 2'. జీవా ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ క్రేజీ సీక్వెల్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మమ్మట్టి, వైఎస్ భారతిగా కేతకీ నారాయన్ నటించారు.

యాత్ర 2 బిజినెస్ ఎంత?:రాజకీయ నేపథ్యం ఉన్న కాన్సెప్టుతో తెరకెక్కిన 'యాత్ర 2' సినిమాపై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి నెలకొంది. దీనికితోడు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ప్రచారం చిత్రాలకు స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమా హక్కులకు మంచి పోటీ ఏర్పడింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 10 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
6వ రోజు తెలుగు వసూళ్లు:మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన 'యాత్ర 2' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ అనుకున్న దానికంటే తక్కువగానే వచ్చాయి. ఆ తర్వాత వీకెండ్‌లో కూడా ఇది క్రమంగా డౌన్ అయింది. వీక్ డేస్‌లో అయితే దారుణంగా పడిపోతోంది. ఫలితంగా ఈ సినిమాకు ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

నాలుగు రోజుల్లో ఎంతంటే:జీవా ప్రధాన పాత్రలో నటించిన 'యాత్ర 2' సినిమాకు టాక్‌కు అనుగుణంగానే తక్కువ స్పందనే వచ్చింది. దీనికితోడు కొత్తగా వచ్చిన సినిమా నుంచి దీనికి పోటీ బాగా వచ్చింది. ఫలితంగా 'యాత్ర 2' మూవీకి ఆరు రోజుల్లో తక్కువ స్పందనే వచ్చింది. అలా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ రూ. 2.80 కోట్లు షేర్, రూ. 5.40 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:మహీ వీ రాఘవ్ - జీవా కాంబోలో రూపొందిన 'యాత్ర 2' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ డల్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ పొలిటికల్ సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 23 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 6 రోజుల్లో రూ. 3.35 కోట్లు షేర్, 6.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:'యాత్ర 2' సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 10.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 11 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరు రోజుల్లో దీనికి రూ. 3.35 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇది హిట్ కావాలంటే మరో రూ. 7.65 కోట్లు షేర్ రాబట్టాలి.


Click it and Unblock the Notifications











