Yatra 2 Movie 7 Days Collections: 50 కోట్ల యాత్ర 2కు షాక్.. వారంలో ఘోరంగా.. అన్ని కోట్ల నష్టాల దిశగా!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే సాగుతూ ఉంటాయి. అందుకే ఆ పాలిటిక్స్ నేపథ్యంతో ఎన్నో రకాల సినిమాలు రూపొందుతోన్నాయి. ఇలా ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లో భారీ విజయాన్ని అందుకుంది మాత్రం 'యాత్ర' అనే చెప్పాలి. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రూపొందినదే 'యాత్ర 2'. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో స్పందన కానీ, వసూళ్లు కానీ రావడం లేదు. దీంతో వారంలోనే ఇది డౌన్ అయింది. మరి 'యాత్ర 2' మూవీకి 7 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరు కూడా చూడండి మరి!
పొలిటికల్ మూవీగా యాత్ర 2:వైఎస్ జగన్ రియల్ స్టోరీతో తెరకెక్కిన చిత్రమే 'యాత్ర 2'. జీవా ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మమ్మట్టి, వైఎస్ భారతిగా కేతకీ నారాయన్ చేశారు. ఈ క్రేజీ సీక్వెల్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

యాత్ర 2 బిజినెస్ ఎంత?:పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్ కాన్సెప్టుతో తెరకెక్కిన 'యాత్ర 2' సినిమాపై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి నెలకొంది. దీనికితోడు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ప్రచారం చిత్రాలకు స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమా హక్కులకు మంచి పోటీ ఏర్పడింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 10 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ అయింది.
7వ రోజు తెలుగు వసూళ్లు:మహీ వీ రాఘవ్ రూపొందించిన 'యాత్ర 2' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ చాలా తక్కువగానే వచ్చాయి. ఆ తర్వాత వీకెండ్‌లో కూడా ఇది స్పందనను అందుకోవడంలో విఫలం అయింది. వీక్ డేస్‌లో అయితే దారుణంగా పడింది. ఫలితంగా ఈ సినిమాకు ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

ఏడు రోజుల్లో ఎంతంటే:జీవా ప్రధాన పాత్రలో నటించిన 'యాత్ర 2' సినిమాకు టాక్‌కు అనుగుణంగానే తక్కువ రెస్పాన్సే వచ్చింది. దీనికితోడు కొత్తగా వచ్చిన సినిమా నుంచి దీనికి పోటీ బాగా వచ్చింది. ఫలితంగా 'యాత్ర 2' మూవీకి ఏడు రోజుల్లో నిరాశ పరిచే వసూళ్లే తెచ్చుకుంది. అలా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ రూ. 2.90 కోట్లు షేర్, రూ. 5.50 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:మహీ వీ రాఘవ్ - జీవా కలిసి చేసిన 'యాత్ర 2' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ డల్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ పొలిటికల్ సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 33 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 24 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 7 రోజుల్లో రూ. 3.47 కోట్లు షేర్, 6.35 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:'యాత్ర 2' సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 10.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 11 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏడు రోజుల్లో దీనికి రూ. 3.47 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇది హిట్ కావాలంటే మరో రూ. 7.53 కోట్లు షేర్ రాబట్టాలి.


Click it and Unblock the Notifications











