Yatra 2 Day 1 Collections: యాత్ర 2 మూవీకి ఊహించని వసూళ్లు.. యాత్ర 1 కంటే.. తొలి రోజు ఎన్ని కోట్లంటే!

గతంలో కంటే ఈ మధ్య కాలంలో పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో ఎన్నో బయోపిక్ మూవీలు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మెప్పును పొందాయి. వాటిలో 'యాత్ర' ఒకటి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో దీనికి కొనసాగింపుగా ఇప్పుడు 'యాత్ర 2' మూవీని చేశారు. దీన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టోరీతో తెరకెక్కించారు. ఫలితంగా మంచి అంచనాలతో ఈ చిత్రం విడుదలైంది. మరి దీనికి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు ఎంత వచ్చాయో మీరు కూడా చూసేయండి మరి!

మరో యాత్రతో వచ్చేశారు
జీవా ప్రధాన పాత్రలో వైఎస్ జగన్ కథతో రూపొందిన పొలిటికల్ మూవీనే 'యాత్ర 2'. క్రియేటివ్ డైరెక్టర్ మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సీక్వెల్‌కు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించాడు. ఇందులో రాజశేఖర్ రెడ్డిగా మమ్మట్టి, వైఎస్ భారతిగా కేతకీ నారాయన్ కనిపించారు.

 Jiiva Starrer Yatra 2 Movie Day 1 Worldwide Box Office Collections

యాత్ర 2 బిజినెస్ ఎంత?
పొలిటికల్ జోనర్‌లో రూపొందిన 'యాత్ర 2' సినిమాపై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన ప్రచారం చిత్రాలకు స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమా హక్కులకు మంచి పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 10 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

అలాంటి టాక్.. డీసెంట్‌గా
మహీ వీ రాఘవ్ దర్శకత్వంలో వైఎస్ జగన్‌కు సంబంధించిన కథతో రూపొందిన 'యాత్ర 2' మూవీకి ప్రీమియర్ షోల నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఇదే కంటిన్యూ అయింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన మోస్తరుగానే లభించిందని చెప్పాలి. దీంతో తొలి రోజు 'యాత్ర 2' మూవీకి డీసెంట్ కలెక్షన్లు సొంతం అయ్యాయి.

తెలుగు రాష్ట్రాలో ఎంత?
'యాత్ర 2' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అనుకున్న విధంగానే రెస్పాన్స్ తక్కువగానే లభించింది. ఇలా ఈ చిత్రం నైజాంలో రూ. 25 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 1.05 షేర్‌ను వసూలు చేసింది. అలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.30 కోట్లు షేర్, రూ. 2.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

 Jiiva Starrer Yatra 2 Movie Day 1 Worldwide Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
జీవా ప్రధాన పాత్రలో నటించిన 'యాత్ర 2' మూవీకి దేశంలోని వేరే ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లోనూ తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ పొలిటికల్ సినిమాకు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 15 లక్షలు షేర్ వచ్చింది. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ. 1.65 కోట్లు షేర్, 3.30 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇదిలా ఉండగా.. యాత్ర 1 మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 2.99 కోట్లు షేర్ వచ్చింది.

టార్గెట్‌ ఇలా.. ఎంత రావాలి?
'యాత్ర 2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 10.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 11 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే దీనికి రూ. 1.65 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇది హిట్ కావాలంటే మరో రూ. 9.35 కోట్లు షేర్ రాబట్టాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X