సన్నీ లియోన్ జిస్మ్-2 కలెక్షన్ల పరిస్థితేంటి?
ముంబై: పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'జిస్మ్ 2'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో అసలు విషయం లేదని, పూజా భట్ కు దర్శకత్వం రాదని, సన్నీలియోన్ నటనకు పనికి రాదని తేల్చేశారు క్రిటిక్స్.
అయితే జిస్మ్ 2 చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెలుతోంది. ఈ సినిమాతో పాటు విడుదలైన Krishna Aur Khans, Yeh Jo Mohabbat Hain, Shuttlecock లాంటి బాలీవుడ్ చిత్రాలను వెక్కి నెట్టేస్తోంది.
బాక్సీఫీసు రిపోర్టు ప్రకారం..... గురువారం వేసిన ఈచిత్రం బెనిఫిట్ షోలు 50 నుంచి 65 శాతం ఆక్యుపెన్సీతో రూ. 1.05 కోట్ల పైచిలుకుకలెక్షన్లు రాబట్టింది. ఓపెనింగ్ డే కలెక్షన్ల వివరాలను తొలి రోజు ఈచిత్రం రూ. 4.5 కోట్ల నుంచి రూ. 5.5 కోట్లు వసూలు అయిన ఉంటాయని ట్రేడ్ వర్గాల అంచనా.
ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఈ రేంజిలో రావడానికి ట్రైలర్సే కారణమని, హాట్ హాట్ రొమాంటిక్ సన్నివేశాలు, ఘాటెక్కించే ముద్దు సీన్లే ప్రేక్షకులు థియేటర్లకు రప్పించాయని, సినిమా టాక్ బయటికి వచ్చాక కలెక్షన్ల పరిస్థితి పూర్తిగా తగ్గుముఖం పడుతుందని నిపుణుల అభిప్రాయం.
పూజాభట్ దర్శకత్వం వహించిన ఈచిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే మహేష్ భట్ అందించారు. డినో మోరియా, పూజా భట్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించారు. సన్నీలియోన్‌తో పాటు రణదీప్ హూడా, అరుణోదయ్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











