twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జిస్మ్ 2 వీకెండ్ కలెక్షన్స్ రూ. 21 కోట్లు

    By Bojja Kumar
    |

    ముంబై: సన్నీ లియోన్ అందాలే పెట్టుబడిగా పూజా భట్ రూపొందించిన 'జిస్మ్ 2' చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమాలో విషయం లేక పోయినా బ్లూఫిలిం తార సన్నీ లియోన్ సినిమాలో ఏం చూపించిందో అనే ఆసక్తితో ప్రేక్షకుల తాకిడి ఎక్కువైంది. ఈ దెబ్బకు ఆగస్టు 3న విడుదలైన ఈచిత్రం ప్రీమియర్ షోతో కలిపి లాస్ట్ వీంకెడ్ ముగిసే సరికి రూ. 21 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని పూజా భట్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

    ఈ చిత్రానికి ఇంతలా రెస్పాన్స్ రావడానికి కారణం 'జిస్మ్' బ్రాండ్ నేమే అని చెప్పుకొచ్చింది దర్శకురాలు. జిస్మ్ 2 చిత్రం కేవలం రూ. 7 కోట్ల ఖర్చుతో రూపొందించారు. సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చినా ఈ రేంజిలో కలెక్షన్లు కురవడం గమనార్హం. కేవలం సన్నీ లియోన్ నటించడమే ఇంతలా రెస్పాన్స్ రావడానికి కారణం అని క్రిటిక్స్ వాదన.

    పూజా భట్ దర్శకత్వం వహించిన ఈచిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే మహేష్ భట్ అందించారు. డినో మోరియా, పూజా భట్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించారు. సన్నీలియోన్‌తో పాటు రణదీప్ హూడా, అరుణోదయ్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    "'Jism 2' has done a business of Rs.21 crore in India over the weekend (despite releasing during Ramzan). Brand 'JISM', my dears, is here to STAY," tweeted Pooja. The film, said to be made on a budget of Rs.7 crore, features the sizzling trio of Indo-Canadian porn star Sunny Leone, Arunoday Singh and Randeep Hooda.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X