Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జిస్మ్ 2 వీకెండ్ కలెక్షన్స్ రూ. 21 కోట్లు
ముంబై: సన్నీ లియోన్ అందాలే పెట్టుబడిగా పూజా భట్ రూపొందించిన 'జిస్మ్ 2' చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమాలో విషయం లేక పోయినా బ్లూఫిలిం తార సన్నీ లియోన్ సినిమాలో ఏం చూపించిందో అనే ఆసక్తితో ప్రేక్షకుల తాకిడి ఎక్కువైంది. ఈ దెబ్బకు ఆగస్టు 3న విడుదలైన ఈచిత్రం ప్రీమియర్ షోతో కలిపి లాస్ట్ వీంకెడ్ ముగిసే సరికి రూ. 21 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని పూజా భట్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ఈ చిత్రానికి ఇంతలా రెస్పాన్స్ రావడానికి కారణం 'జిస్మ్' బ్రాండ్ నేమే అని చెప్పుకొచ్చింది దర్శకురాలు. జిస్మ్ 2 చిత్రం కేవలం రూ. 7 కోట్ల ఖర్చుతో రూపొందించారు. సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చినా ఈ రేంజిలో కలెక్షన్లు కురవడం గమనార్హం. కేవలం సన్నీ లియోన్ నటించడమే ఇంతలా రెస్పాన్స్ రావడానికి కారణం అని క్రిటిక్స్ వాదన.
పూజా భట్ దర్శకత్వం వహించిన ఈచిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే మహేష్ భట్ అందించారు. డినో మోరియా, పూజా భట్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించారు. సన్నీలియోన్‌తో పాటు రణదీప్ హూడా, అరుణోదయ్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.