twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రపంచ బాక్సాఫీస్‌ను దున్నేసిన జోకర్.. మైండ్ బ్లాంక్ అయ్యేలా 7 వేల కోట్ల కలెక్షన్లు

    |

    హాలీవుడ్ చిత్రం జోకర్ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లన నమోదు చేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ను అధిగమించి రికార్డులను తిరగరాస్తున్నది. జోక్విన్ ఫొనిక్స్ అద్భుతమైన నటన జోకర్‌ను విజయపథంలో నడిపించింది. ఈ సినిమాకు అన్నివర్గాల ప్రేక్షకులతోపాటు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. గత ఐదువారాల్లో ప్రపంచ రికార్డును తిరగరాసే విధంగా కలెక్షన్లు రాబట్టింది. మొత్తం కలెక్షన్లు ఎంతంటే..

    ఇండియాలో ధాటిగా

    ఇండియాలో ధాటిగా

    ఫోర్బ్స్ తాజా రిపోర్టు ప్రకారం.. జోకర్ చిత్రం భారత్‌లో కూడా భారీ వసూళ్లను సాధించింది. అక్టోబర్ 2వ తేదీన రిలీజైన ఈ చిత్రం బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలకు ఎదురొడ్డి రికార్డు వసూళ్లను సాధించింది. అదే రోజున రిలీజైన వార్, స్కై ఈజ్ పింక్ అనే చిత్రాలకు మించి కలెక్షన్లను సాధించింది. మొత్తంగా భారతీయ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.50 కోట్లు కలెక్ట్ చేసింది.

    ప్రపంచ బాక్సాఫీస్ వద్ద

    ప్రపంచ బాక్సాఫీస్ వద్ద

    ఇక ప్రపంచ బాక్సాఫీస్ వద్ద జోకర్ చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు రిలీజైన కామెడీ నేపథ్యం ఉన్న చిత్రాల్లో జోకర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును నమోదు చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.6816.5 కోట్లు అంటే 953 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. కాగా ఈ చిత్రం రూ.446.1 కోట్ల బడ్జెట్‌తో అంటే 62.5 మిలియన్ డాలర్ల తెరకెక్కితే.. 15 రెట్లకుపైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.

    తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి.. ఎక్కువ లాభాలు

    తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి.. ఎక్కువ లాభాలు

    తక్కువ బడ్జెట్‌తో రూపొంది ప్రపంచ బాక్సాఫీస్‌ను శాసించిన చిత్రాల్లో ది మాస్క్ టాప్‌గా నిలిచింది. 23 మిలియన్ డాలర్లతో ది మాస్క్ చిత్రం రూపొందింతే.. 351 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. వెనొమ్ 90 మిలియన్ డాలర్లతో తెరకెక్కితే.. 854 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. బ్యాట్‌మన్ చిత్రాన్ని 35 మిలియన్ డాలర్లతో నిర్మిస్తే.. 411 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించింది. ఇక డెడ్ పూల్ అనే చిత్రం 58 మిలియన్ డాలర్లతో రూపొందితే ఏకంగా 783 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అని ఫోర్బ్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

    బ్లాక్‌బస్టర్ విజయం వెనుక సీక్రెట్

    బ్లాక్‌బస్టర్ విజయం వెనుక సీక్రెట్

    జోకర్ చిత్రంలో జోక్విన్ ఫొనిక్స్ నటనతోపాటు రాబర్ట్ డీ నీరో, జాజీ బీట్జ్ లాంటి దిగ్గజ నటుల పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆలరించాయి. ఈ చిత్రంలో నటించిన యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్ ఆస్కార్ స్థాయిలో ఉన్నాయంటూ విదేశీ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది. హాస్యం, భావోద్వేగం లాంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో కాసుల పంట పడింది. ఇక జోకర్ చిత్రానికి టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించారు.

    English summary
    Joaquin Phonix's Joker shaken world box office, which is directed by Todd Phillips. As per Forbes, It earns $953 million collections. and also become most profitable comedy film ever.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X