John Wick: Chapter 4 Collections కలెక్షన్ల చరిత్ర సృష్టించిన జాన్ విక్ 4..ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లంటే?
హాలీవుడ్ నటుడు కీన్ రీవ్స్ నటించిన జాన్ విక్: చాప్టర్ 4 చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా అరుదైన మైలురాయిని చేరింది. చాడ్ స్టాహెల్‌స్కీ దర్శకత్వంలో ఈ చిత్రం మార్చి 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. గత నెల రోజులుగా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సంచలన రీతిలో వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...
800 కోట్ల బడ్జెట్‌తో జాన్ విక్ 4 : జాన్ విక్: ఛాప్టర్ 4 చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను సుమారు 100 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 820 కోట్ల రూపాయాలతో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగినట్టే భారీ ఒపెనింగ్స్ సాధించింది. ఇప్పటి వరకు వచ్చిన మూడు సిరీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా జాన్ విక్ 4 ఘనతను సాధించింది.

పలు దేశాల్లో ప్రీమియర్లకు భారీ రెస్సాన్స్ : జాన్ విక్: ఛాప్టర్ 4 సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్లు ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని బ్రూనోస్ ఎయిర్స్, సావ్ పాలవో, టోరెంటో, పారిస్, బెర్లిన్, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, మెక్సికో సిటీ, వర్సా, లిస్బన్, బుచారెస్ట్, జోహనెస్ బర్గ్, బార్సిలోనా, అమ్‌స్టర్ డామ్, లండన్, న్యూయార్క్, లాస్ ఎంజెలెస్ నగరాల్లో ప్రీమియర్లను ప్రదర్శించారు.

ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే? : ఇక జాన్ విక్ 4 చిత్రం ఇండియాలో బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధించింది. ఇండియాలోని ప్రధాన నగరాల్లో ప్రదర్శించిన ప్రీమియర్లకు మంచి రెస్సాన్స్ రావడంతో ఒపెనింగ్స్ భారీగా నమోదు అయ్యాయి. ఇండియాలో 61 కోట్ల గ్రాస్ కలెక్షన్లను, 50 కోట్లకుపైగా షేర్ వసూళ్లను నమోదు చేసింది. ఇటీవల కాలంలో వచ్చిన హాలీవుడ్ చిత్రాల్లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
అరుదైన మైలురాయిని దాటేసి..: జాన్ విక్ 4 చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద అరుదైన మైలురాయిని అధిగమించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 3300 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఇంకా పలు దేశాల్లో మంచి కలెక్షన్లను రాబడుతుండటం విశేషంగా మారిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వందల కోట్లంటే? :
జాన్ విక్ 4 సినిమా ఓవరాల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం అమెరికా, కెనడా దేశాల్లో రికార్డు కలెక్షన్లను నమోదు చేసింది. ఈ రెండు దేశాల్లో ఈ సినిమా 176 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం మొత్తంగా 226 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో ప్రస్తుతం 402 మిలియన్ డాలర్ల కలెక్షన్లను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











