John Wick: Chapter 4 day 1 collections.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత.. తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లంటే?
హాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమలో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న చిత్రం జాన్ విక్: చాప్టర్ 4. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో కీన్ రీవ్స్, డానీ యెన్, బిల్ స్కార్స్‌గార్డ్ తదితరులు నటించారు. ఇప్పటికే ఈ చిత్రం మూడు భాగాలుగా వచ్చి భారీ విజయాన్ని అందుకొన్నాయి. తాజాగా అంటే మార్చి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొల రోజు ఏం రేంజ్ కలెక్షన్లు నమోదు చేసిందనే వివరాల్లోకి వెళితే..

జాన్ విక్ 4 సినిమా బడ్జెట్ ఎంతంటే?
జాన్ విక్: చాప్టర్ 4 సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా సుమారు 100 మిలియన్ డాలర్లు అంటే.. 800 కోట్ల రూపాయలకుపైగా వ్యయంతో తెరకెక్కించారు. దర్శకుడు చాడ్ స్టాహెల్‌స్కీ ఖర్చుకు వెనుకాడకుండా కళ్లు చెదిరే యాక్షన్ సీన్లతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే విధంగా రూపొందించారు. క్లైమాక్స్‌లో 30 నిమిషాలపాటు సాగే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా ఉంటుందని చెప్పవచ్చు.

తొలి రోజు హిట్ టాక్‌తో
జాన్ విక్: చాప్టర్ 4 సినిమా తొలి ఆట నుంచే మంచి రెస్పాన్స్ కూడగట్టుకొంటున్నది. స్టోరి నేరేషన్, యాక్షన్ సీన్లు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌గా ఉన్నాయనే మాట వినిపిస్తున్నది. యాక్షన్ ప్యాక్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఇండియాలో 1500 థియేటర్లలో
ఇక ఇండియాలో జాన్ విక్: చాప్టర్ 4 చిత్రాన్ని ప్రముఖ చైన్ థియేటర్స్ పీవీఆర్ భారీగా రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ సినిమాను ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేసింది. ఈ సినిమాను దాదాపు 1500 థియేటర్లలో రిలీజ్ చేశారు.తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 1 లక్షల టికెట్లను అమ్మినట్టు పీవీఆర్ యాజమాన్యం వెల్లడించింది.

ఇండియాలో ఆక్యుపెన్సీ ఎంతంటే?
జాన్ విక్: చాప్టర్ 4 సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడంతో ఓపెనింగ్స్ భారీగా నమోదు కాలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ చిత్రం పలు భాషల్లో, వివిధ ప్రాంతాల్లో సుమారుగా 25 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. మౌత్ టాక్‌తో వసూళ్లు పెరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. వారాంతంలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించవచ్చని పేర్కొంటున్నారు.

ఇండియాలో తొలి రోజు కలెక్షన్ల అంచనా
జాన్ విక్: చాప్టర్ 4 సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఓ మోస్తారు కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తొలి రోజు అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా 10 కోట్లకుపైగా గ్రాస్.. 5 కోట్ల రూపాయలకుపైగా షేర్ నమోదు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల వసూళ్లంటే?
జాన్ విక్: చాప్టర్ 4 ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా యూకే, ఇటలీ, యూఎస్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, మెక్సికోలో విడుదలైంది. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్ డాలర్ల నుంచి 70 మిలియన్ డాలర్ల మేర అంటే 570 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని వెల్లడిస్తున్నారు. ఈ సినిమా రానున్న రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











