John Wick 4 Collections జాన్ విక్ 4 కలెక్షన్ల జోరు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
హాలీవుడ్‌లో భారీ విజయాలు అందుకొన్న జాన్ విక్ సిరీస్‌కు సంబంధించిన నాలుగో ఫ్రాంచైజీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన జాన్ విక్: చాఫ్టర్ 4 చిత్రం ప్రేక్షకుల ఆదరణను చూరగొంటున్నది. కీన్ రీవ్స్, డానీ యెన్, బిల్ స్కార్స్‌గార్డ్ నటించిన ఈ చిత్రం క్రమక్రమంగా వసూళ్లను పెంచుకొంటూ వెళ్తున్నది. గత 4 రోజుల్లో జాన్ విక్ 4 సినిమా సాధించిన కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

4 వేల స్క్రీన్లలో జాన్ విక్ 4
జాన్ విక్ సిరీస్‌లో గత మూడు చిత్రాలకు మంచి రెస్సాన్స్ రావడంతో జాన్ విక్ 4 సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. చాడ్ స్టాహెల్‌స్కీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని 100 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 వేల థియేటర్లలో రిలీజ్ చేశారు.

ఇండియాలో జాన్ విక్ 4 కలెక్షన్లు
ఇక జాన్ విక్ 4 చిత్రానికి సంబంధించిన గత నాలుగు రోజుల కలెక్షన్లు పరిశీలిస్తే.. ఇండియాలో ఈ సినిమా 2.45 కోట్లు, రెండో రోజు 6.3 కోట్లు, మూడో రోజు 8.7 కోట్లు, నాలుగో రోజు 8.41 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 26 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. గత రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది.

ఇంగ్లీష్, హిందీ వెర్షన్ వసూళ్లు
ఇక జాన్ విక్ 4 సినిమా ఇంగ్లీష్ వెర్షన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 2 కోట్లు, రెండో రోజు 4.4 కోట్లు, మూడో రోజు 6.4 కోట్లు, నాలుగో రోజు 5.76 కోట్లు వసూలు చేసింది. ఇక హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. తొలి రోజు 35 లక్షలు, రెండో రోజు 1.45 కోట్లు, మూడో రోజు 1.75 కోట్లు, నాలుగో రోజు 2.14 కోట్లు వసూలు చేసింది. ఇంగ్లీష్ వెర్షన్ 16 కోట్లకుపైగా వసూళ్లను సాధిస్తే.. హిందీ వెర్షన్ 7 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

తెలుగు, తమిళ వెర్షన్ కలెక్షన్లు
ఇక తెలుగు, తమిళ వెర్షన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 3 లక్షలు, రెండో రోజు 2 లక్షలు, మూడో రోజు 22 లక్షలు, నాలుగో రోజు 19 లక్షలు వసూలు చేసింది. తమిళ వెర్షన్ తొలి రోజు 6 లక్షలు, రెండో రోజు 25 లక్షలు, మూడో రోజు 33 లక్షలు, నాలుగో రోజు 32 లక్షలు వసూలు చేసింది. తెలుగులో సుమారు 50 లక్షలు, తమిళంలో 98 లక్షల వసూళ్లు రాబట్టింది. అయితే తెలుగు, తమిళంలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. కారణం ఈ సినిమా థియేటర్లలో ఉందనే విషయం కూడా తెలియకపోవడం ఓ కారణం అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా జాన్ విక్ 4 సినిమా కలెక్షన్ల వివరాలకు వస్తే.. శుక్రవారం 29.4 మిలియన్ డాలర్లు, శనివారం 25.8 మిలియన్ డాలర్లు, ఆదివారం 18.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తొలి వారాంతంలో సుమారు 74 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు 600 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తొలి వారం ముగిసే సమయానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











