Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జోకర్ కలెక్షన్ల హవా.. బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ హంగామా
భారతీయ బాక్సాఫీస్ వద్ద వార్, సైరా చిత్రాలతో పోటీ పడుతూ హాలీవుడ్ సినిమా జోకర్ చిత్రం భారీ వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. జోక్విన్ ఫోనిక్స్ రూపొందించిన ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. తాజాగా విడుదలైన ది స్కై ఈజ్ పింక్ సినిమాకు ధీటుగా ఈ సినిమా వసూళ్లు ఉండటం గమనార్హం.
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్, మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రాలతోపాటు జోకర్ చిత్రం అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ బాక్సాఫీస్ వద్ద సైరా తేలిపోవడంతో వార్తోపాటు జోకర్ సినిమాకు ప్రేక్షకాదరణ పెరిగింది.
తొలి రోజున జోకర్ చిత్రం ఏకంగా రూ.5.15 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం. అదే సమయంలో వార్ చిత్రం రూ.51.06 కోట్లు మొదటి రోజున కొల్లగొట్టింది. ఆ తర్వాత అదే ఊపును జోకర్ కొనసాగిస్తూ 12 రోజుల్లో రూ.50 కోట్ల క్లబ్లో చేరింది.
జోకర్ చిత్రం దేశవ్యాప్తంగా రూ.450 స్క్రీన్లలో విడుదలైంది. తొలివారంలో రూ.32.70 కోట్లు సాధించగా, రెండో వారంలో శుక్రవారం రూ.2.5 కోట్లు, శనివారం రూ.4.5 కోట్లు, ఆదివారం రూ.4.5 కోట్లు వసూలు చేసింది. రెండోవారం పూర్తయ్యే సరికి ఈ చిత్రం రూ.75 కోట్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక అదే రోజున విడుదలైన వార్ చిత్రం రూ.271.65 కోట్లు ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది. రెండోవారాంతంలో రూ.33.3 కోట్లు రాబట్టడం విశేషం.