Joker 2 Collections: 8500 కోట్ల బడ్జెట్.. జోకర్ 2 మూవీకి దారుణంగా కలెక్షన్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
అమెరికన్ మ్యూజికల్, సైకాలాజికల్ థ్రిల్లర్ జోకర్: ఫోలియో ఏ డెక్స్ సినిమాకు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన వ్కక్తమవుతున్నది. టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎమ్మా టిలింగర్, జోసెఫ్ గార్నర్‌తో కలిసి టాడ్ ఫిలిప్స్ స్వయంగా నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? సాధించిన కలెక్షన్లు ఎంత? ఎంత వసూలు చేస్తే లాభాల్లోకి వస్తుందనే వివరాల్లోకి వెళితే..
2019 సంవత్సరంలో సంచలన విజయం సాధించిన జోకర్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది. ఈ సినిమాలో జోక్విన్ ఫోనిక్స్, లేడీ గాగ, బ్రెండన్ గ్లీసన్, క్యాథరీన్ కీనర్, జాజీ బీట్జ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను వెనీస్ ఫిలిం ఫెస్టివల్‌లో సెప్టెంబర్ 4వ తేదీన ప్రీమియర్‌గా ప్రదర్శిస్తే మంచి స్పందన వ్యక్తమైంది.

2019 సంవత్సరంలో విడుదలైన జోకర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే.. 8500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ మూవీని సుమారుగా 1700 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 1000 కోట్లుగా నిర్ణయించారు.
జోకర్ 2 సినిమాకు అనూహ్యంగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. నార్త్ అమెరికాలో ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. తొలివారాంతం ముగిసే సమయానికి ఈ సినిమా 60 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 500 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఈ సినిమాను సుమారుగా 4000 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు.

ఇక ఇండియాలో కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం తొలి రోజు భారీగానే వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా 5.25 కోట్ల రూపాయల నికర కలెక్షన్లు రాబట్టింది. కానీ రెండో రోజు మాత్రం భారీగా పడిపోయి కేవలం 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో రోజు ఈ సినిమా 1 కోటి రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో 8 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











