Jolly LLB 3 Day 3 Box Office: 50 కోట్లు ఔట్.. జాలీగా కుమ్మేస్తోన్న అక్షయ్.. మూడో రోజు ఎన్ని కోట్లంటే?

జాలీ ఎల్ఎల్‌బీ కామెడీ ఫ్రాంఛైజీలో భాగంగా జాలీ ఎల్ఎల్‌బీ 2కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం జాలీ ఎల్ఎల్‌బీ 3. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. సుభాష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జాలీ ఎల్ఎల్‌బీ 3లో సౌరభ్ శుక్లా, హ్యుమా ఖురేషి, అమృతరావు, సీమా బిశ్వాస్, శిల్పా శుక్లా తదితరులు కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 19న జాలీ ఎల్ఎల్‌బీ 3 వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో జాలీ ఎల్ఎల్‌బీ 3 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 3వ రోజు అక్షయ్ కుమార్ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో పరిశీలిస్తే..

జాలీ ఎల్ఎల్‌బీ 3 బడ్జెట్?
జాలీ ఎల్ఎల్‌బీ 3కి అమన్ పటేల్, అనురాగ్ సైకియా, విక్రమ్ మోన్‌ట్రోస్‌, మంగేష్ దక్డేలు సంగీతం అందించగా.. రంగరాజన్ రాంభద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. స్టార్ స్టూడియో 18, కంగ్రా టాకీస్ బ్యానర్‌లపై అలోక్ జైన్, అజిత్ అంధారేలు సంయుక్తంగా జాలీ ఎల్ఎల్‌బీ 3ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి జాలీ ఎల్ఎల్‌బీ 3 సినిమాకు సుమారు 120 కోట్ల బడ్జెట్ అయినట్లుగా బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

Jolly LLB 3 Day 3 Expected Box Office Collections Worldwide Akshay Kumar s movie witnessed a very good growth

జాలీ ఎల్ఎల్‌బీ 3 బ్రేక్ ఈవెన్ టార్గెట్
జాలీ ఎల్ఎల్‌బీ బ్రాండ్‌తో పాటు టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో జాలీ ఎల్ఎల్‌బీ 3పై బాలీవుడ్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ మూవీకి వరల్డ్ వైడ్‌గా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. జాలీ ఎల్ఎల్‌బీ 3 బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా 3500 స్క్రీన్‌లలో రిలీజ్ చేశారు.

జాలీ ఎల్ఎల్‌బీ 3 రెండు రోజుల కలెక్షన్స్
100 కోట్ల రూపాయల టార్గెట్‌తో బరిలోకి దిగిన జాలీ ఎల్ఎల్‌బీ 3 బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో అక్షయ్ కుమార్ మూవీకి ఇండియా వైడ్ తొలి రోజు 13 కోట్ల రూపాయలు, రెండో రోజు 20 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. దీంతో ఇండియా వైడ్ రెండ్రోజుల్లో ఈ సినిమా 33 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక నార్త్ అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరప్, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ తదితర దేశాల్లోనూ జాలీ ఎల్ఎల్‌బీ 3కి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఓవర్సీస్‌లో రెండ్రోజుల వరకు ఈ మూవీకి 11 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి జాలీ ఎల్ఎల్‌బీ 3కి వరల్డ్ వైడ్‌గా రెండ్రోజుల వరకు 44 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

జాలీ ఎల్ఎల్‌బీ 3 మూడో రోజు కలెక్షన్స్
ఆదివారం కావడంతో జాలీ ఎల్ఎల్‌బీ 3కి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయని ట్రేడ్ పండితులు తెలిపారు. మూడో రోజు సాయంత్రం 4 గంటల వరకు జాలీ ఎల్ఎల్‌బీ 3కి 20 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు ఢిల్లీలో 1352 షోలు, ముంబైలో 711 షోలు, అహ్మదాబాద్‌లో 582 షోలు ప్రదర్శితమైనట్లుగా సాక్‌నిక్ వెల్లడించింది. జాలీ ఎల్ఎల్‌బీ 3కి ఫస్ట్ షో, సెకండ్ షోలకు మరింతగా ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. అక్షయ్ కుమార్ మూవీ మూడో రోజు వరల్డ్ వైడ్‌గా 22 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో జాలీ ఎల్ఎల్‌బీ 3 మూవీ మూడు రోజుల్లో 66 కోట్ల రూపాయలు రాబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X