Joshua: Imai Pol Kaakha Collections గౌతమ్ వాసుదేవ్ మీనన్ లేటేస్ట్ లవ్ స్టోరి.. హిట్టా? ఫట్టా?

ప్రతిష్టాత్మక వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారీ కే గణేష్ నిర్మించిన చిత్రం జాషువా: ఇమై పోల్ కాకా (Joshua: Imai Pol Kaakha). ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందు భారీ క్రేజ్‌ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేసిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

జాషువా: ఇమై పోల్ కాకా (Joshua: Imai Pol Kaakha) సినిమా కథ విషయానికి వస్తే.. జాషువా (వరుణ్) కాంట్రాక్ట్ కిల్లర్. ప్రాణాలకు ముప్పు ఉన్న ప్రముఖులకు బాడీగార్డ్‌గా వ్యవహరిస్తుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో తన మాజీ ప్రేయసి కుందవి చిదంబరం (రాహీ) ప్రాణాలకు ముప్పు ఉండటంతో ఆమెకు బాడీగార్డ్‌గా ఉంటాడు. అమెరికాలో మెక్సికన్ డ్రగ్ కార్టెల్ నుంచి ఉన్న ముప్పును జాషువా ఎలా ఎదుర్కొన్నాడు? మాజీ ప్రియుడితో కుందవి ప్రయాణం ఎలా జరిగింది? కుందవి ప్రాణాలకు ఏర్పడిన ముప్పును ఎలా అడ్డుకొన్నాడు అనేది సినిమా కథ.

Joshua Imai Pol Kaakha Expected Box Office Collections Worldwide Gowtham Vasudev Menon Movie Sluggish Start

నూతన నటీనటులతో జాషువా: ఇమై పోల్ కాకా (Joshua: Imai Pol Kaakha) మూవీని రూపొందించినప్పటికీ ఖర్చు భారీగానే అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా యూనిట్ సభ్యుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 10 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

జాషువా: ఇమై పోల్ కాకా (Joshua: Imai Pol Kaakha) సినిమాకు రిలీజ్‌కు ముందు మంచి డిమాండ్ ఏర్పడటంతో తమిళనాడులో భారీగానే అంటే.. 400 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు యూత్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి.. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అంతగా రెస్పాన్స్ కనిపించలేదని పేర్కొంటున్నారు.

Joshua Imai Pol Kaakha Expected Box Office Collections Worldwide Gowtham Vasudev Menon Movie Sluggish Start

గత మూడు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 50 లక్షల షేర్, 1 కోటి రూపాయల గ్రాస్, రెండో రోజు 80 లక్షల షేర్, 1.5 కోట్ల గ్రాస్, మూడో రోజు 90 కోట్ల షేర్.. 1.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో 2.2 కోట్ల షేర్.. 4.3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే. కనీసం 6 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X