శర్వానంద్ 'జర్నీ'ఎంత హిట్టంటే...
శర్వానంద్, జై,అనన్య, అంజలి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'జర్నీ'. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో ఏ చిన్న చిత్రానికి లభించినంత ఆదరణ ఈ చిత్రానికి లభిస్తోంది. దాంతో నిర్మాత సురేష్ కొండేటి ఈ చిత్రం ప్రింట్స్ ని మరో 35 పెంచుతున్నారు.
ఈ సంగతిని నిర్మాత సురేశ్ కొండేటి తెలియజేస్తూ "ఈ సినిమాకు 'ప్రేమిస్తే' కంటే ఆరింతలు పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. సాధారణంగా కొన్ని విడుదలై ఘన విజయం సాధిస్తే ఓ వారం తర్వాత అదనపు ప్రింట్లు వేస్తారు. కానీ 'జర్నీ' సినిమా విడుదలైన రెండో రోజే మరో 35 థియేటర్లలో విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నటించిన శర్వానంద్, జై, అంజలి, అనన్య పాత్రలు చూసిన ప్రతి ఒక్కర్నీ బాగా ఆకట్టుకుంటున్నాయి. శరవణన్ దర్శకత్వంతో పాటు సత్య అందించిన అద్భుతమైన సంగీతం ఈ చిత్రానికి మరో హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా కచ్చితంగా వంద రోజులు ఆడుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.
ఇక మంచి ఎమోషనల్ జర్నీగా సాగే ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల నుంచి మంచి పాజిటివ్ రిపోర్ట్ రావటంతో డిస్ట్ర్రిబ్యూటర్స్,ఎగ్జిబిటర్స్ మంచి హ్యాపీగా ఉన్నారు. ఇక శర్వానంద్ సైతం తెలుగులో గ్యాప్ తర్వాత హిట్ రావటంతో చాలా సంతోషంగా ఉన్నాడు. గమ్యం తర్వాత శర్వానంద్ కు లభించిన మరో హిట్ ఈ చిత్రం.


Click it and Unblock the Notifications











