RRR కలెక్షన్స్ పై జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్.. బాలీవుడ్ లో ఆ దర్శకులంటే ఇష్టమని అంటూ..
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్ పేర్లు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ హీరోలకు బాలీవుడ్ బడా సస్థల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా కలెక్షన్స్ పై కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా తనకు ఇష్టమైన బాలీవుడ్ బడా దర్శకులపై కూడా కొన్ని కామెంట్స్ చేశాడు ఆ వివరాల్లోకి వెళితే..

విడుదల తరువాత కూడా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన త్రిబుల్ ఆర్ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఆ తర్వాత అంచనాల స్థాయిని కూడా చాలా ఈజీగా అందుకున్న RRR ప్రస్తుతం సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తోంది.

మరోసారి రాజమౌళి స్టామినా..
ఇప్పటికి 500 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ అయితే అందుకుంటోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు పాత్రలపై కూడా జనాలు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.. పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా సినిమా చూసిన తర్వాత ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. రాజమౌళి మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు అన్ని సినిమాలకు భాషతో సంబంధం లేదు అని కూడా చెబుతున్నారు.

కలెక్షన్స్ పై ఎన్టీఆర్ రియాక్షన్
ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాపై కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా RRR సినిమా కు సంబంధించిన కలెక్షన్స్ పై కూడా చాలా సున్నితంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్న సందర్భంగా మీ రియాక్షన్ ఏమిటి అని అడుగగా నెంబర్లు అనేవి తన డిపార్ట్మెంట్ కాదు అని కాకపోతే సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నప్పుడు అది ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఉంటుంది.. అని అలాగే రాబోయే సినిమాలను మరింత ఉన్నతంగా తెరకెక్కించేందుకు అవకాశం ఉంటుంది అని కూడా తెలియజేశాడు.

నెక్స్ట్ సినిమా..
సినిమా విజయం పట్ల చాలా ఆనందంగా ఉన్నట్లు చెప్పిన ఎన్టీఆర్ దాదాపు మూడేళ్ల తర్వాత తన నుంచి వచ్చిన సినిమా కావడంతో అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలిపారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా జూన్ లో మొదలవుతుందని కూడా వివరణ ఇచ్చాడు.
Recommended Video


ఆ దర్శకులంటే ఇష్టం అంటూ..
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ లో నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ కు భారీ స్థాయిలో ఆఫర్స్ వస్తున్నట్లుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇంకా ఆ విషయం పై క్లారిటీ ఇవ్వని జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం సంజయ్ లీలా బన్సాలీ అంటే తనకు చాలా ఇష్టమైని.. అలాగే రాజ్ కుమార్ హిరాని సినిమాలని కూడా చాలా ఇష్టపడతాను అని తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











