twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: బాహుబలి మరో రికార్డు బ్రేక్.. ఈ రెండింటికీ 1000కి పైగానే తేడా.. అరాచకం కాదు అంతకు మించి!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న దర్శకుల్లో దర్శకధీరుడు రాజమౌళి ఒకరు. ఆరంభంలో ఓ మోస్తరు బడ్జెట్ చిత్రాలను మాత్రమే రూపొందించిన ఆయన.. 'బాహుబలి'తో పాన్ ఇండియా మార్కెట్‌ను టచ్ చేశాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమాలోనే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇంతటి భారీ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 'బాహుబలి' రికార్డునే బ్రేక్ చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

    టాప్ డైరెక్టర్‌తో స్టార్ హీరోలు

    టాప్ డైరెక్టర్‌తో స్టార్ హీరోలు

    దర్శకధీరుడు రాజమౌళి రూపకల్పనలో టాలీవుడ్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించారు.

    బెడ్‌పై బట్టల్లేకుండా హీరోయిన్: హాట్ వీడియో షేర్ చేసిన రాంగోపాల్ వర్మబెడ్‌పై బట్టల్లేకుండా హీరోయిన్: హాట్ వీడియో షేర్ చేసిన రాంగోపాల్ వర్మ

    భారీ అంచనాలతో విడుదల

    భారీ అంచనాలతో విడుదల

    RRR మూవీపై ఆరంభం నుంచే ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు సైతం క్రియేట్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12 భాషల్లో, 20 దేశాల్లో దీన్ని రిలీజ్ చేస్తున్నారు.

    ఇండియాలోనే టాప్ మూవీ

    ఇండియాలోనే టాప్ మూవీ


    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 190 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాల రైట్స్ కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

    జిప్ తీసేసి రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: క్లీవేజ్ షోతో తెలుగు పిల్ల అరాచకంజిప్ తీసేసి రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: క్లీవేజ్ షోతో తెలుగు పిల్ల అరాచకం

    సందడిగా.. పాజిటివ్ టాక్‌తో

    సందడిగా.. పాజిటివ్ టాక్‌తో

    క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో ప్రీమియర్ షోలతో పాటు బెనిఫిట్ ఆటలు కూడా పూర్తయ్యాయి. దీనికి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో కళకళలాడుతున్నాయి. దీంతో అన్ని చోట్లా పండుగ వాతావరణం కనిపిస్తోంది.

    RRR తెలుగు థియేటర్ల లిస్ట్

    RRR తెలుగు థియేటర్ల లిస్ట్

    విడుదలకు ముందే భారీ హైప్‌ను ఏర్పరచుకున్న RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లలోనే విడుదల అవుతుంది. దీన్ని నైజాంలో 455 థియేటర్లలో, సీడెడ్ ఏరియాలో 385 థియేటర్లలో, టోటల్ ఆంధ్రాలో 560కి పైగా థియేటర్లలో విడుదల అవుతోంది. అంటే మొత్తంగా ఏపీ, తెలంగాణలో కలిపి ఈ సినిమా 1400 థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

    RRR Twitter Review: తెలుగోడు మీసం తిప్పే టాక్.. ఇండియన్ చరిత్రలో తొలిసారి.. ఏ హీరో రోల్ బాగుందంటే!RRR Twitter Review: తెలుగోడు మీసం తిప్పే టాక్.. ఇండియన్ చరిత్రలో తొలిసారి.. ఏ హీరో రోల్ బాగుందంటే!

    ప్రపంచ వ్యాప్తంగా ఎన్నంటే

    ప్రపంచ వ్యాప్తంగా ఎన్నంటే

    RRR మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక, దీన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1400 థియేటర్లలో, తమిళనాడులో 480, కర్నాటకలో 310, కేరళలో 300, హిందీ ప్లస్ రెస్టాప్ ఇండియాలో 3900, ఓవర్సీస్‌లో 3800 థియేటర్లలో తీసుకు వస్తున్నారు. మొత్తంగా ఈ చిత్రం 10200 థియేటర్లలో రాబోతుంది.

    Recommended Video

    Why RRR Bigger Than Baahubali ? RRR VS Baahubali Budget And Collections | Filmibeat Telugu
    బాహుబలి రికార్డు బద్దలైంది

    బాహుబలి రికార్డు బద్దలైంది

    ప్రపంచ వ్యాప్తంగా RRR మూవీ 10200 థియేటర్లలో రాబోతుంది. దీంతో ఎక్కువ థియేటర్లలో విడుదలవుతోన్న చిత్రాల జాబితాలో బాహుబలి రికార్డును బద్దలు కొట్టేసి ఏకంగా టాలీవుడ్‌లో మొదటి స్థానానికి చేరింది. ఈ జాబితాలో బాహుబలి 2 (9000 థియేటర్లు), సాహో (7978 థియేటర్లు), రాధే శ్యామ్ (7010 థియేటర్లు), సైరా 4632 థియేటర్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

    English summary
    Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. Lets Know about This Movie World Wide Total Theaters Count.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X