‘బాద్‌షా’ సెకండ్ వీక్ కలెక్షన్స్
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 'బాద్‌షా' మూవీ ఏప్రిల్ 5న విడుదలై బాక్సాఫీసు వద్ద విజయవంతంగా సూపర్ కలెక్షన్లతో దూసుకెలుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఎన్టీఆర్ గత సినిమాలకు దేనికీ లేని విధంగా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ అమెరికా బాక్సాఫీసు వద్ద రెండో వారంలోనూ టాప్ ప్లేసు దక్కించుకుంది. బాద్ షా తో పాటు ప్రదర్శితం అవుతున్న ఇండియన్ సినిమాలన్నింటీని వసూళ్ల పరంగా బీట్ చేసింది.
బాద్ షా చిత్రం అమెరికాలో 110 స్ర్కీన్లలో విడుదలై మొదటి వారం రూ. 6.03 కోట్లు వస్లూ చేసింది. జూనియర్ ఎన్టీఆర్-కాజల్ జంటగా నటించిన ఈచిత్రం రెండో వారంలో 78 స్ర్కీన్లలో ప్రదర్శితం అయింది. ఇటు తెలుగు నుంచి గానీ, అటు హిందీ నుంచి గానీ రెండో వారం బాద్ షాకు పోటీగా పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాలేదు. దీంతో బిజినెస్ ఎక్స్‌ట్రార్డినరీగా అయింది.
ఈ చిత్రం రెండో వారం 78 స్ర్కీన్లలో ప్రదర్శింపబడుతూ $ 1,25,404 వసూలు చేసింది. టోటల్ గా 11 రోజుల్లో ఈ చిత్రం ఇక్కడ రూ. 6.72 కోట్లు($ 12,32,757) రాబట్టింది. బాద్ షా సెకండ్ వీక్ కలెక్షన్స్ దీనితో పాటు విడుదలై కేవలం రూ. 50 లక్షలు మాత్రమే వసూలు చేసిన Nautanki Saala మూవీతో పోలిస్తే బెటరే.
గతంలో విడుదలైన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వసూళ్లను పరిశీలిస్తే...ఈ చిత్రం టోటల్ గా ఇక్కడ రూ. 8.90 కోట్లు ($ 16,39,200) రాబట్టి అమెరికా తెలుగు సినిమా చరిత్రలో నెం.1 గ్రాసర్‌గా నిలిచింది. మరి బాద్ షా చిత్రం దాన్ని బీట్ చేస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











