‘బాద్‌షా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన 'బాద్ షా' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఫస్ట్ వీకెండ్ ఫెంటాస్టిక్ కలెక్షన్స్ సాధించింది. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెనర్‌గా రూపొందిన ఈచిత్రం అమెరికా బాక్సాఫీసు చార్ట్ లో టాప్ పొజిషన్ దక్కించుకుంది.
'బాద్ షా' చిత్రం రికార్డు స్థాయిలో అమెరికాలో 117 థియేటర్లలో విడుదలైంది. దీనికి తోడు సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం, హిట్ టాక్, గుడ్ ఎంటర్టెనర్ అని మౌత్ టాక్ రావడంతో సినిమా బిజినెస్ ఊపందుకుంది. దీంతో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈచిత్రం తొలి వీకెండ్(గురు, శుక్ర, శని, ఆది) రూ. 5.70 కోట్లు ($10,45,192) వసూలు చేసింది.
గతంలో 'గబ్బర్ సింగ్' మూవీ ఫస్ట్ వీకెండ్ రికార్డ్ రూ. 4.13 కోట్లను ($7,65,373) వసూలు చేయగా....'బాద్ షా' ఆ రికార్డును అధిగమించింది. అయితే 'బాద్ షా' చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రికార్డును మాత్రం బద్దలు కొట్టడంలో విఫలమైంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం 69 స్ర్కీన్లలో విడుదలై ఫస్ట్ వీకెండ్ రూ. 6.87 కోట్లు ($12,62,100) వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











