twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: 'బాద్‌ షా' బిజినెస్ కేక

    By Srikanya
    |

    హైదరాబాద్: ఇండిస్టీలో ఎక్కడ చూసినా అంతా ఎన్టీఆర్ 'బాద్‌ షా' బిజినెస్ గురించే చర్చ. ఈమధ్య కాలంలో ఇంత బిజినెస్ ఏ సినిమాకి కూడా కాలేదని అంతా ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా శ్రీనువైట్ల రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగు ముగింపు దశలో వుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ నాగార్జునసాగర్‌ సమీపంలో షూట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటివరకూ అయిన బిజినెస్ యాభై నాలుగు కోట్ల పై చిలుకే అని తెలుస్తోంది. ఇంతవరకూ ఈ సినిమాకు అయిన ఖర్చు 55 కోట్ల రూపాయలు.

    ట్రేడ్ లో ఉన్న సమాచారం బట్టి... సీడెడ్ లో అయితే తొమ్మిది కోట్ల వరకూ పలికిందని తెలుస్తోంది. ముగ్గరు కలిసి ఈ సీడెడ్ ని తీసుకున్నారని సమాచారం. వెస్ట్ గోదావరి... 2 కోట్ల అరవై లక్షలుకు పాలకొల్లు బుజ్జి తీసుకోగా, ఈస్ట్ గోదావరి.. రెండున్నర కోట్లుకు పైగా తీసుకున్నారని చెప్తున్నారు. వైజాగ్ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. అక్కడ గట్టి పోటీ ఉండటంతో ఇంకా ఏదీ ఖరారు చేయలేదు. నైజాం లో కూడా పదికోట్లకు పైగా పలుకుతోంది. దిల్ రాజు తీసుకున్నట్లు చెప్తున్నారు. గుంటూరు,నెల్లూరు కలిపి ఐదు కోట్లు పైచిలకు వెళ్లిందనేది టాక్.

    ఇలా విడుదలకు ముందు అన్ని రైట్స్ కలిపి యాభై నాలుగు కోట్ల వరకూ బిజినెస్ చేస్తోందని చెప్పుకుంటున్నారు. అయితే బండ్ల గణేష్ మాత్రం ఆచి తూచి బిజినెస్ విషయంలో అడుగులు వేస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించి శాటిలైట్ రైట్స్ ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది. అయితే ఓ ధర్డ్ ఫార్టీ ఈ రైట్స్ ని కొనుగోలు చేసిందని సమాచారం. ఆ రేటు ఏడు కోట్ల యాభై లక్షలు పలికిందని తెలుస్తోంది. ధర్డ్ పార్టీ వారు తర్వాత మరో రేటుకు టీవీ ఛానెల్స్ కు అమ్ముకుంటారు. ఇప్పటికే ఈ చిత్రం హక్కులు దక్కించుకునేందుకు రెండు పాపులర్ టీవీ ఛానల్స్ పోటీ పడుతున్నాయి. దాంతో మధ్యరకంగా ఈ రేటుకి ఫిక్స్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

    కథకి అవసరమైన రిచ్‌నెస్‌ తెరపై చూపించడం కోసం వీలైనంత ఎక్కువగా విదేశాల్లో షూటింగు జరపడం వల్లనే ఈ స్థాయిలో ఖర్చు అయిందని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కున్న మార్కెట్‌కి ఈ బడ్జెట్‌ వర్కౌట్‌ అవుతుందా! అని కొందరు సందేహాన్ని వ్యక్తం చేస్తుంటే, కాంబినేషన్‌పై వున్న అంచనాల కారణంగా అదే స్థాయిలో బిజినెస్‌ కూడా ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో ఈ సినిమా బిజినెస్‌ జరుగుతోంది. బండ్ల గణేష్‌ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్ గా నటిస్తుండగా, నవదీప్‌ విలన్ గా కనిపించనున్నాడు.

    ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Ntr’s Baadshah Movie doing big business before Release Jr.NTR’s Baadshah even before hitting the sets is doing its pre-release business taking the expectations to the peaks. The distributions rights for the Guntur and Nellore areas have already been bagged by Hari Venkat Pictures and Sri Nikethan Films respectively for undisclosed figures and the business has been closed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X