సెన్సేషనల్ రెవెన్యూతో రెండోవారం పూర్తిచేసుకొన్న జూ ఎన్టీఆర్

By Sindhu

రొటీన్ ఫార్ములా చిత్రమనే టాక్ ఉవ్వెత్తున వినిపిస్తూనే వున్నా..పైరసీ రక్కసి ప్రభావం ఉదతంగా కనిపిస్తూనే వున్నా, సెన్సేషనల్ రెవెన్యూతో సెంకడ్ వీక్ ని పూర్తి చేసుకుంది జూ ఎన్టీఆర్ తాజా విజయం 'బృందావనం". నిజానికి రెండో వారంలో వసూళ్ళ వేగం కాస్త మందగించినప్పటికీ ఫైనల్ గా సంతప్తికరమైన స్థాయిలోనే 'బృందావనం" సెటిల్ అయిందనేది ట్రేడ్ రిపోర్ట్. కాగా తొలవారం లో 22కోట్ల 14లక్షలకు పైగా షేర్ సాధించి తెలుగు సినిమాల ఓపెనింగ్ కలెక్షన్స్ లో సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా3 నిలిచిన 'బృందావనం" రెండో వారంలోనూ డీసెంట్ రెవెన్యూ రాబట్టి దిగ్విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో అధికారికంగా వెలువడ్డ 'బృందావనం" టు వీక్స్ షేర్స్ వివరాలు ఇలా ఉన్నాయి...

నైజాం : 8,02,54,067
సీడెఢ్ : 5,47,60,905
ఉత్తరాంద్ర: 2,15,04,940
గుంటూరు : 2,03,06,074
నెల్లూరు :1,02,94,521
కష్ణా : 1,36,10,705
ఈస్ట్ : 1,25,00,000
వెస్ట్ : 1,20,00,000
కర్ణాటక : 3,67,04,074
ఓవర్సీస్ : 4,96,98,000
చెన్నై, ఒరిస్సా : 69,00,000
ఓవరాల్ గా బందావనం కలెక్ట్ చేసిన రెండు వారాల షేర్ రూ. 31,85,33,286/-

కాగా 'బృందావనం" విజయం సాదించటంతో జూ ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రం సక్సెస్ మీట్ ని ఆయన విజయవాడలో చేయాలని నిర్ణయించారు. తన అభిమానులు సమక్షంలో ఆ ఆనందాన్ని పంచుకోలని నిర్మాత దిల్ రాజుతో కలిసి నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 30వ తేదీన ఈ సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరగనుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X