Devara Collections:దేవర కలెక్షన్ల సునామీ..ప్రభాస్‌నే వెనక్కి నెట్టిన ఎన్టీఆర్,ప్రీ సేల్స్‌లో ఎన్ని కోట్లంటే?

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర రిలీజ్‌కు రెడీ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. దేవర ద్వారా బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్‌లు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌ వివరాలు చూస్తే.

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌‌లో తెరకెక్కుతోన్న మూవీ కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు ఆచార్య డిజాస్టర్ తర్వాత తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్ధితుల్లో కొరటాల సర్వశక్తులు ఒడ్డి ఈ సినిమాను రూపొందించారు. కథ, స్క్రీన్‌ప్లే, క్యాస్టింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు కొరటాల శివ. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, పోస్టర్స్, పాటలు, ట్రైలర్‌లలో కొరటాల శివ కష్టం కనిపించింది. దేవరకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ మంజూరు చేయగా.. రన్ టైమ్ 3 గంటల వరకు వచ్చింది. రక్తపాతం, హింసాత్మక సన్నివేశాలు ఉన్నప్పటికీ సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం.

jr ntr devara breaks Prabhas records in pre sale collections in north America here s the details

ముంబైలో ట్రైలర్ లాంచ్ నిర్వహించగా.. హిందీ మీడియాతో ఎన్టీఆర్, కొరటాల, సైఫ్ అలీఖాన్ ముచ్చటించి సినిమా విశేషాలు పంచుకున్నారు. స్టార్ స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2కి దేవర టీమ్ హాజరై సందడి చేసింది. టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, సైఫ్ అలీఖాన్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రెటీలు కరణ్ జోహర్, అలియా భట్‌లు కూడా ఈ షోకు వచ్చారు. సెప్టెంబర్ 21న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

ఇకపోతే.. రిలీజ్‌కు ముందే దేవర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఎన్టీఆర్ సినిమా దూసుకెళ్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌ ద్వారా అప్పుడే 1 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమాగా దేవర చరిత్ర సృష్టించింది. తాజాగా ఎన్టీఆర్ సినిమా మరో ఘనత సాధించింది. పాన్ ఇండియా సినిమాల పరంగా నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రికార్డులను దేవర బద్ధలుకొట్టింది.

jr ntr devara breaks Prabhas records in pre sale collections in north America here s the details

డార్లింగ్ గత సినిమాలు సలార్‌కు నార్త్ అమెరికాలోని 375 లోకేషన్‌లలో 1225 షోలకు గాను 23 వేలకు పైగా టికెట్లు అమ్ముడై ఆరున్నర లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. రీసెంట్ ప్రభాస్ బ్లాక్‌బస్టర్ కల్కి 2898 ఏడీ నార్త్ అమెరికాలోని 700 లోకేషన్‌లలో 2442 షోలకు గాను 23 వేలకు పైగా టికెట్లు అమ్ముడై 1.41 మిలియన్ డాలర్లు వసూలయ్యాయి. ఇప్పుడు ఈ రికార్డులను ఎన్టీఆర్ తిరగరాశారు.. సలార్, కల్కి కంటే తక్కువ లోకేషన్‌లలోనే (528) 1530 షోలకు గాను 47 వేలకు పైగా టికెట్లు అమ్ముడై 1.42 మిలియన్ డాలర్లను దేవర సొంతం చేసుకుని సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు ఎన్టీఆర్. రిలీజ్‌కు ఇంకా 10 రోజుల సమయం ఉండటంతో షోలు, టికెట్ సేల్స్, కలెక్షన్లు మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: jr ntr devara prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X