Devara Day 19 Collections: దేవర సరికొత్త సంచలనం.. 500 కోట్ల ఎన్టీఆర్ మూవీ రికార్డు!

దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం మూడో వారంలో కూడా భారీ వసూళ్లను రాబడుతున్నది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతున్నది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా నమోదు చేసిన సరికొత్త రికార్డుల వివరాల్లోకి వెళితే..

దేవర చిత్రం తొలివారం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 165 కోట్ల రూపాయలు, హిందీలో 45 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 24 కోట్ల రూపాయలు, తమిళంలో 5 కోట్ల రూపాయలు, మలయాళంలో 2 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమా తొలివారం 220 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది.

Jr NTR Devara Movie 14 days box office collections report here the details

ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం రెండోవారంలో కూడా అదే జోష్‌ను కొనసాగించింది. తెలుగులో 30 కోట్ల రూపాయలు, హిందీలో 15 కోట్ల రూపాయలు, కన్నడలో 5 కోట్ల రూపాయలు, తమిళంలో 2 కోట్ల రూపాయలు, మలయాళంలో 50 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 52.5 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక మూడో వారంలో దేవర చిత్రం నిలకడగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా 15వ రోజు 3 కోట్ల రూపాయలు, 16వ రోజు 5.5 కోట్ల రూపాయలు, 17వ రోజు 5.5 కోట్ల రూపాయలు, 18వ రోజున 2.5 కోట్లు వసూలు చేసింది. ఇక 19వ రోజు ఈ సినిమా 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 17 కోట్ల రూపాయలు రాబట్టింది.

Jr NTR Devara Movie 14 days box office collections report here the details

దేవర చిత్రం ఇండియా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలివారం 220 కోట్లు, రెండోవారం 52.5 కోట్లు, మూడో వారంలో ఇప్పటి వరకు 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 320 కోట్ల నికరంగా కలెక్షన్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 80 కోట్లకుపైగా వసూళ్లనురాబట్టింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల నికరంగా 500 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రం 400 కోట్ల రూపాయల నికర వసూళ్ల జాబితాలో చేరింది. ఇప్పటికీ సాహో, బాహుబలి1, సాలార్ 1, కల్కి 2898 AD, RRR, బాహుబలి 2 తర్వాత దేవర ఈ ఘనతను సాధించింది. ఇంకా ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో సంచలన విజయం సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X